కళాశాలలు, వర్సిటీల్లో బయోమెట్రిక్
• విద్యాశాఖ ఆదేశాలు జారీ
కళాశాలకు రాకుంటే బోధన రుసుములు రానట్లే బయోమెట్రిక్ లేకుంటే. విద్యార్థులు కళాశాలలకు రావడం లేదు. ఉద్యోగాలు చేస్తూ ఇంటర్, డిగ్రీ, పీజీ చేసే వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. బయోమెట్రిక్ హాజరును కచ్చితంగా అమలు చేయాలి లేకపోతే చదివే వారి హాజరు సంఖ్య గణనీయంగా తగ్గుతుందని విద్యాశాఖ భావిస్తున్నది. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ, హైదరాబాద్, కాకతీయ, మొదలైన విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు, ఉద్యోగులు రోజులు తరబడి తమ విభాగాలకు రావడం లేదు. తరగతులు జరగడం లేదు.
రాష్ట్రంలో ని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విశ్వవిద్యా బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులకూ దీన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్య దర్శి ఆదేశాలు జారీ చేశారు. కళాశాలలతోపాటు విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు ద్వారా విద్యార్థులను పైతరగతులకు పంపించాలంటే బోధన రుసుములు, ఉపకార వేతనాలు ఇవ్వాలన్నా ఈ హాజరును పరగణనలోకి తీసుకుంటారు. సిబ్బందికి విద్యార్థుల హాజరు కోసం తప్పనిసరి ఈ నెల 13 తేదీ నుంచి అమలు చేయాలని రాష్ట్రం ప్రభుత్వం చూస్తుంది.