భైంసా ఆల్పోర్స్ లో గణిత ఒలింపియడ్ పోటీ”

Samadarshini.com

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో “ఆల్పోర్స్ గణిత ఒలింపియడ్ పోటీ”నిన్న జరిగింది.
|శ్రీనివాస రామానుజన్ గారి సేవలు ఎంతో చారిత్రాత్మకమైనవని మరియు గణిత శాస్త్ర చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించారని పాఠశాల ప్రిన్సిపాల్, అధినేత ఆదేశానుసారం స్థానిక రాహుల్నగర్లోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్సెక్స్ట్ పాఠశాల భైంసా లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామానుజన్ గారి విశిష్టతను మరియు వారు చేసిన కృషిని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వారి జయంతిని పురస్కరించుకొని


ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఆల్ఫోర్స్ మాథ్స్ ఒలింపియడ్ టెస్ట్ అనే

పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున పరీక్షను నిర్వహించడం జరుగుతున్నదని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారియొక్క ప్రతిభను చాటి సంస్థ వారు అందజేస్తున్న పలు పారితోషికాలను గెలుచుకోవాలని చెప్పారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో గణిత శాస్త్రం చాలా కీలకంగా మారిందని మరియు గణిత శాస్త్రంలో పట్టు సాధించినవారికి అనేక ఉపాధి అవకాశాలల్లో విజయం సాధించడంతో పాటు ఉత్తమంగా ఉండవచ్చనని తెలుపుతూ విద్యార్థులు పోటీ ప్రపంచంలో వెలువడుతున్న వివిధ మార్పులకు అనుగుణంగా వ్యవరిస్తూ వాటిని అలవర్చుకొని అందుకు ధీటుగా ముందుకు పయనించి అగ్రగామిగా నిలవాలని చెప్పారు.

రామానుజన్ గారు వారి చిన్నతనం నుండే గణిత శాస్త్రం పట్ల మక్కువ చూపి అందులో నైపుణ్యం సాధించి భారతదేశ గణిత శాస్త్ర విభాగానికే ఒక తలమానికం చెప్పారు. వారు నిర్దేశించిన మార్గదర్శకాలను విద్యార్థులందరు తప్పనసరిగా పాటించినట్టైతే మరియు అమలుపరిచినట్లైతే ఉత్తమంగా ఉండవచ్చనని అభిప్రాయపడుతూ పోటీతత్వంతో పాటు ఉత్సాహంగా విజయాలను ‘నమోదు చేయాలని ఆకాంక్షించారు.