డిల్లీకి లక్షలాదిగా తరలి వచ్చిన ఎస్సి ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక ప్రజలు
సమదర్శిని న్యూస్ : 10.09.2024
బిజెపి హటావో దేశ్ కే బచావో
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాదు బిజెపి నరేంద్ర మోడీ దాని అనుబంధ సంస్థలు
ఇచ్చిన తీర్పు
హామీలు అమలు చేయడం చాతకాక ప్రజల మధ్య వివాదాలు పెట్టీంచిన బిజెపి నరేంద్ర మోడీ
పెద్ద ఎత్తున బిజెపి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెనక్కు తీసుకోవాలని డిల్లీ మొత్తం నినాదాలతో మరుమోగించారు తీర్పును వెనక్కు తీసుకోనే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఎస్సి ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ అన్నారు
ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో హల్ తో పాటు పార్కు తో పాటు డిల్లీ ప్రతి గల్లీలో బహుజనులు అన్నారు
అదేవిధంగా ఎస్సి ఎస్టీ వర్గీకరణ వెనక్కు తీసుకునే వరకు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని కోరారు
అన్ని రాష్ట్రాల నుండి లక్షలాది మంది పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఇదే నెల 27న హైదారాబాద్ లో సదస్సు నిర్వహించడం జరుగుతుందనీ ఈ సదస్సుకు ముప్పై మూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈ సమావేశానికి జాతీయ సమితి చైర్మన్ సుప్రీం కోర్టు అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాల మహానాడు జాతీయ సమితి అధ్యక్షులు డా,,వి ఎల్ రాజు రాష్ట్ర అధ్యక్షులు జె ఎన్ రావు అల్ ఇండియా ఎస్సి ఎస్టీ అడ్వకేట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుల రాజలింగం జాతీయ అంతర్జాతీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొంటారు కావున జిల్లా కమిటీ అధ్యక్షులు ముఖ్యమైన నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు రాష్ట్ర కార్యదర్శి తీగల శేఖర్ రాష్ట్ర జాతీయ నాయకులు రామారావు రాజారావు వెంకట్ రావు రమేష్ పెద్ద ఎత్తున లక్షలాది మంది పాల్గొన్నారు