తెలుగు రాని తెలుగు విద్యార్థులు

ఇదేనా భాషపై ప్రేమ

ఆవేదన ?

ఓ రాజకీయనాయకులారా
నా గోడు వినండి .
ఒక క్షణం తీరిక చేసుకొని
ఆలకించండి నా ఆవేదన .

ఓట్ల కోసం పాట్లు పడే మీరు
వేదికపై ఉపన్యాసాలు
మాట్లాడేది తెలుగుభాషలోన
లేక ఆంగ్లేయమా !

ఒకసారి ఓట్లకోసం
సామాన్యులదగ్గర
ఆంగ్లంలో ఉపన్యసించండి
ఎన్ని ఓట్లు వస్తాయో !

ఓటుకు యాత్రలు
సభలు పెట్టె అన్ని పార్టీల
నాయకులు
ఒకసారి ఆలోచన చేయండి .

తెలుగు భాష అంటే
చిన్న చూపు ఎలా ?

తెలుగుజాతి అంటే
తెలుగుభాష కాదా
వారు మాట్లాడేది
తెలుగు కాకూడదా !

ఇది
నా మనసుపడ్డ ఆవేదన

తెలుగుభాష లేకుంటే
తెలుగుసినిమా
బాక్సాపీస్ లెందుకు ?

ఓ తెలుగువాడిగా
మీ
మిడతాని సురేష్ కుమార్
ఆవేదన .

మిడతాని సురేష్ కుమార్
B.A(meca);B.A(special Telugu );
Bed;M.A(Telugu );M.C.a;((m.a(jornalisam )).

వడలి గ్రామం
పెనుగొండ మండలం
ప .గో .జిల్లా
9573980822