సముద్రగర్భంలో అలజడిలా ….

రెండక్షరాల “మౌనం ”
కాదు మూగతనం
అనేక లక్షణాల రూపం
నిస్సహాయత, ఎదురీత లకు
దిశ దశ కు ఓ సంకేతం
తుఫాను ముందు ప్రశాంతత
సముద్రగర్భంలో అలజడి లా
విస్పో టానికి ముందు పునాది
ప్రశాంతత కు, జవాబు కు
సమయ నిర్ణయానికే “మౌనం ‘
…………………….
పత్తి శివప్రసాద్ 9440001224
నిర్మల్ జిల్లా కవి
ఎన్నో అవార్డులు అందుకున్నారు.

***************
అవసరం కోసం
తప్పదని
చేసిన అప్పుకు
తాకట్టు లోని
నా ‘బంగారం ‘
అసలు తీర్చలేక
వడ్డీ కట్టలేక
వాడి వ్రేలి కి
‘ఉంగరం ‘
అయ్యింది
………………
పత్తి… 9440001224

Comments (0)
Add Comment