బోనాల పండుగ ఉత్సవాలు

బోనాల పండుగ
Prof Narasaiah Panjala
——-
ఆషాఢ మాసం
కొందరికి మోదం
కొందరికి ఖేదం.

పండు ముత్తైదువులకు
యువతులకు సంబరమే
సంబరం, ఆషాఢ మాసం.

నెలంతా పండుగ సందడి
ఊరంతా మురిపాలు
పట్టు చీరల పర పరలు
అందరూ అమ్మోరులే.

పల్లె వాసుల పండుగ
గ్రామ దేవతల పండుగ —-
పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ —–
కొలువు దీరే పండుగ.

గ్రామ దేవతల పండుగ
ఆషాఢ మాసంలో వచ్చే
అంటువ్యాధుల నుండి
రక్షణ కోరే పండుగ.

బోనాల పండుగ
అమ్మలకు భోజనం
సమర్పించే పండుగ.

తెలంగాణ పండుగ
తెలుగోడి పండుగ
వెయ్యి ఏండ్ల నుండి
కాకతీయుల కాలం నుంచి
వస్తున్న పండుగ.

నూతన వధూవరులకు
ఖేదం ఈ పండుగ
నెల రోజుల ఎడబాటు
చంపేసే పండుగ.

వస్త్ర వ్యాపారులకు
ఖజానా నింపు పండుగ
మధ్య తరగతి ఉద్యోగుల
జేబుకు చిల్లి ఈ పండుగ.
***

Comments (0)
Add Comment