నర్సవ్వ ఎట్లున్నవే

నరసవ్వ.. ఎట్లున్నవే ..!
( అమ్మ మాటల్లో..)
++++
నా ముద్దుల బిడ్డా
మురిపాల కన్నా
నా నరసవ్వ..
ఎట్లున్నవే..!
నీకు బువ్వ తినిపించిన
మూతి తుడిచిన
కొంగుతో …
నా ముద్దుల బిడ్డా..
ఎట్లున్నవే !
ఈ చేతులతో కొట్టిన
నా చేతులు పడిపోను
ఈ నోటితో తిట్టిన
నా నోరు పడిపోను.
ఉన్నది పెట్టిన
వచ్చినట్టు
వండిన
రుచి లేకపోతే
గిన్నె ఇసిరి కొడుదువు;
నరసవ్వ..ఎట్లున్నవే..!
దేవుడు పిలిస్తే వచ్చిన
వచ్చి అప్పుడే యాభై ఏళ్ళు
.ఈ రోజు పెద్దలకు బియ్యం
ఇచ్చే రోజు కదా బిడ్డా..
నాకు పిండాలు పెడుతుంటే
ఈ ముచ్చట్లు గుర్తొచ్చిన యే
నా నరసవ్వ.
***
Prof Narasaiah Panjala
20.7.2025, Hyderabad.

Comments (0)
Add Comment