79 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారత్

ఆలోచనతో ఆచరణ సాధ్యం

79 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం
రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే 2.5 కోట్ల డోసులు పంపిణీ

97.65 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 35,662 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,40,639) 1.02 శాతం

వారపు పాజిటివిటీ రేటు (2.02 శాతం) గత 85 రోజులుగా 3 శాతం కంటే తక్కువ
Posted Date:- Sep 18, 2021

కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భారత్‌ మరో రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 2.5 కోట్లకుపైగా డోసులను ప్రజలకు అందించింది. దీంతో, టీకా కార్యక్రమం 79 కోట్ల (79,42,87,699) డోసుల మైలురాయిని దాటింది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన టీకా డోసులు 2.15 కోట్లుగా ఉండగా, రాష్ట్రాలు నివేదించిన ప్రకారం 2.5 కోట్లకు పైగా ఉన్నాయి. 78,49,738 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే తుది నివేదిక ప్రకారం, రోజువారీ టీకాల కచ్చిత సంఖ్యను నవీకరిస్తారు.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

ఆరోగ్య సిబ్బంది
మొదటి డోసు
1,03,67,858
రెండో డోసు
86,96,165

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు
మొదటి డోసు
1,83,43,570
రెండో డోసు
1,44,00,387

18-44 ఏళ్ల వారు
మొదటి డోసు
32,12,63,332
రెండో డోసు
5,62,22,452

45-59 ఏళ్ల వారు
మొదటి డోసు
14,93,59,311
రెండో డోసు
6,77,70,267

60 ఏళ్లు పైబడినవారు
మొదటి డోసు
9,61,06,803
రెండో డోసు
5,17,57,554
60 ఏళ్లు పైబడినవారు
79,42,87,699

ఈ అద్భుత విజయం పట్ల దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలుపుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు:
“రికార్డు స్థాయి టీకా కార్యక్రమంపై ప్రతి భారతీయుడు గర్విస్తాడు”