నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం ఆవిష్కరణ

Isbn news

నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం ఆవిష్కరణ

తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న నిర్మల్ జిల్లా సమగ్రస్వరూపం తేది 09-01-2024 న మంగళవారం పగలు 2:00 గంటలకు స్థానిక ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘభవనంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోర్ కమిటీ కన్వీనర్, ప్రముఖ కవి చరిత్ర పరిశోదకులు dr తుమ్మల దేవరావ్, కోర్ కమిటీ సభ్యులు, ప్రముఖ కవులు dr దామెర రాములు, dr చక్రధారి,నేరెళ్ల హన్మంతు, జాదవ్ పుండలిక్ రావు, అమరవేణి వెంకటరమణ, dr కృష్ణం రాజు మరియు. నిర్వహణ కమిటీ సభ్యులు కామరపు జగదీశ్వర్, పత్తి శివప్రసాద్, కుమ్మరి నాగరామ్,అబ్బడి రాజేశ్వర్ రెడ్డి,పోలీస్ భీమేష్ లు తెలిపారు. నిర్మల్ జిల్లా సంస్కృతి ని, చరిత్ర, నాగరికత వైభవాన్ని భావితరాలకు చాటే “నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపాన్ని జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ అశ్విన్ సంగ్వి ఆవిష్కరణ చేయనున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి,ప్రధాన కార్యదర్శిDr జున్ను చెన్నయ్య ముఖ్య అతిథులు గా హాజరుకానున్నారు. సుమారు రెండువేల సం రాల నిర్మల్ చరిత్ర ను ఈ పుస్తకం లో రికార్డ్ చేస్తున్నట్లు, బావితరాల వారు, పోటీ పరీక్షలు రాసేవారు, విశ్వ విద్యాలయాల్లో పరిశోదనలు చేసేవారికి, జిల్లా చరిత్ర ను అధ్యయనం చేసేవారికి “నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం” ఒక కరదీపికగా ఉపయోగపడుతుందని కోర్ కమిటీ కన్వీనర్ తుమ్మల దేవరావ్ తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్ పూనిక వహించడం వల్లనే సమగ్ర స్వరూపం రూపుదిద్దుకోందని అన్నారు. మన జిల్లాలో ఆలయాలు, జాతరలు, మతాల ఆస్తిత్వం, శాసనాలు, కోటలు, రాజుల పాలన తెలిపే వివరాలు, నిర్మల్ బొమ్మలు, గిరిజన జీవన వైదుశ్యం,జిల్లాలో స్వచ్ఛందసంస్థలు,సంగీతవాద్యాలు, కంచరుల నైపుణ్యం,పత్రికలు, జిల్లా ప్రముఖులు, పర్యాటక ప్రాంతాలు,జానపద కళలు, తాత్విక చింతనలు తదితర అనేక అంశాలతో కూడిన 46 వ్యాసాలు 400 పైగా పేజీలతో ఈ పుస్తకం విలువడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో అందరు భాగస్వాములు కావాలని కోర్ కమిటీ విజ్ఞప్తి చేశారు.