నాశబోయిన నరసింహకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

నాశబోయిన నరసింహ (నాన)కు *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో చోటు

కవిరత్న నాశబోయిన నరసింహ (నాన)కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా సేవా సాహితీ సంస్థ వారు “సేవా సాహితీ సప్తాహం” పేరిట నిర్వహించిన తెలుగు భాషా వారోత్సవాల్లో పాల్గొని సమన్వయ కర్తగా వ్యవహరించి, కవితా పఠనం చేసినందుకు కవి,రచయిత మరియు ఆరోగ్య పర్యవేక్షకులు నాశబోయిన నరసింహ గారికి *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో చోటు దక్కింది. దాదాపు 20 దేశాల నుండి 1000 మంది కవులు 23-8-2021 నుండి 29-8-2021 వరకు జరిగిన మెగా గ్లోబల్ వర్చ్యువల్ కవి సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. ఇంతమంది తెలుగు కవులు ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల పాటు కవితా వారోత్సవాల్లో పాల్గొనడం ఒక అపురూప ఘట్టం.అందుకు గాను కవి సమ్మేళనంలో మూడవరోజు కాశీనాధుని నాగేశ్వరరావు సాహితీ వేదిక ద్వారా సమన్వయకర్తగా వ్యవహరించి మరియు కవితా పఠనం చేసినందుకు నాశబోయిన నరసింహ(నాన)గారి పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేస్తూ,ప్రశంసా పత్రాన్ని నిర్వాహకులు అంతర్జాలం ద్వారా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు తన సాహితీ మిత్రులతో,సహోద్యోగులతో ఆనందాన్ని పంచుకున్నారు.
***************************************