అంశం:-
సిరివెన్నెల సీతారామశాస్త్రి
శీర్షిక:-
ధరణి ని వదలి భరణి
………….
.చిన్ననాటి నేస్తమా
తొందర పడి వెళుతున్నావే
ఇంతింతై వటుడింతై
అనకాపల్లి నుంచి
ఆకాశమంత ఎత్తుకి
సినీగేయ రచనల
మాంత్రికుడిగా
సినీవినీలాకాశన ఎదిగి
జగమంత కుటుంబం నాది అని
ఆదిభిక్షువు వాడినేమి
అడిగేది అని,
నిగ్గదీసి అడుగు సిగ్గులేని
జనాన్ని అని,
అపురూపమైనదమ్మ
ఆడజన్మ అని,
ఎన్నో ఎన్నెన్నో
సినీగీతాలను మహాకవి
శ్రీ శ్రీ కి వారసుడిగా
కీర్తినార్జించి
దేశంలో అత్యున్నత
పురస్కారం పద్మశ్రీ,
నంది అవార్డులకే వన్నెతెచ్చి,
మూడువేల మధురమైన,
మనోరంజక, సామాజిక స్పృహ
కలిగిన గీతాలను రచించి
,సిరివెన్నెల గా ఇంటిపేరు ను
స్థిరపరుచుకుని గాన గంధర్వులు
బాల సుబ్రహ్మణ్యం చే
ఆప్యాయంగా సీతారాముడు
అని పిలిపించుకున్న ప్రియనేస్తమా
భరణి ధరణిని వదలి
ఏకాదశి పుణ్యదినాన మాకు
అందనంత దూరంగా
శ్రీరామచంద్రుని చరణాల
చెంతకు చేరినావు పుణ్యశీలి
సీతారాముడు నీ కివే
నా అక్షర నివాళి..!!
ఓం శాంతి
……….
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
(బాల్య స్నేహితుడు) అనకాపల్లి
విశాఖపట్నం జిల్లా 9963265762
………………….