అంతర్జాతీయ సదస్సు 2025 మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖ,

Madras Christian College
Department of Telugu
మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగు శాఖ,
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు
అంశం: “ప్రాచీన ద్రావిడ భాషా కావ్యాలు – తులనాత్మకత”
తేదీలు: జనవరి 29-30 , 2025
===========+============

పరిశోధక మిత్రులకు, ఆచార్యులకు
అందరికీ నమస్కారం!
తెలుగుశాఖ- మద్రాసు క్రైస్తవ కళాశాల & ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్తంగా జనవరి 29 -30 “ ప్రాచీన ద్రావిడ భాషా కావ్యాలు – తులనాత్మకత”అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాము. గతంలో క్రైస్తవ కళాశాల నిర్వహించిన అన్ని సదస్సులకు సానుకూలంగా స్పందించి మీ సహకారాన్ని అందించి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మీరు ద్రావిడ భాషల్లోని ఏ రెండు కావ్యాలైనా తీసుకుని తులనాత్మకంగా పరిశోధనాపత్రం రాయాల్సివుంది. అంగీకరించిన వారు ఎంచుకున్న అంశాన్ని తులనాత్మక దృక్పథంతో విశ్లేషిస్తూ తమ పత్రాన్ని సిద్ధం చేయవలసిందిగా కోరుతున్నాం. సిద్ధం చేసిన పత్రాన్ని dravidakavyalu@gmail.com
అనే ఈమెయిల్ కి 20 జనవరి 2025 లోపు పంపించవల్సిందిగా కోరుతున్నాం.
సదస్సుకు సంబంధించిన వివరాలన్నీ ఈ సమూహంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయబడతాయి.

https://chat.whatsapp.com/CY2sZgchA1pEbMbCrionwV

పరిశోధనా దృక్పథంతో నాణ్యత గల అన్ని పత్రాలు పుస్తకంగా అచ్చు వేస్తాం. వివరాలు వాట్సాప్ సమూహంలో తెలియజేస్తాం.
ఈ సదస్సు విజయవంతం కావడానికి మీ ఆశీస్సులను కోరుతున్నాం.

డా. శ్రీపురం యజ్ఞశేఖర్
తెలుగుశాఖ, మద్రాసు క్రైస్తవ కళాశాల
తాంబరం, చెన్నై .

ఆచార్య మాడభూషి సంపత్ కుమార్
డైరెక్టర్, ప్రా. తె . వి. అధ్యయన కేంద్రం

Get real time updates directly on you device, subscribe now.