సుప్రీంకోర్టు పేరుతో మోసం సహించం ఉద్యమిస్తాం

రిజర్వేషన్ ఎస్సీ లకు లేకుండా చేయాలని కుట్ర

సమదర్శిని న్యూస్, ఉట్నూర్ :

ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, ఎస్సీలకు రాజ్యాంగబద్ధమైన న్యాయం చేయాలని దళిత రత్న కాటం రమేష్ డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా మందకృష్ణ మాదిగకు ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించే విధంగా ఆలోచనను తప్పుపడుతున్నామన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇదంతా అగ్రకుల కుట్ర, దీన్ని తిప్పి కొడతాం. మరో ఇంద్రవెల్లి ఉద్యమం చేస్తామని అన్నారు.

*వర్గీకరణ ముసుగులో క్రీమీ లేయర్*

*క్రీమీ లేయర్ అంటే…* Sc, St రిజర్వేషన్ ఉన్న వ్యక్తులకు ఒక సారి ప్రభుత్వ ఉద్యోగం పొందితే.. మున్సిపల్ స్వీపర్ ఉద్యోగం వచ్చినా కూడా.. ఆ కుటుంబం రిజర్వేషన్ పూర్తిగా వదులుకోవాలి (అంటే మన పిల్లలకు చదువు పరంగా, ఉద్యోగం పరంగా, ఉపాధి పరంగా, రాజకీయ పరంగా, ఫీ రియాంబర్స్ కూడా వర్తించదు )అని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ లో ఉన్న 296 పేరా గ్రాఫ్ 7 th లైన్ లో పొందు పరిచింది… దయచేసి సోదరులారా ఆలోచించండి..!రిజర్వేషన్లలను❓రాజ్యాంగ హక్కులను ఎలా దూరం చేస్తారో మేం చూస్తాం ..!!

ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కు ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల ఐక్యమత్యానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పును భావించాల్సి వస్తుందన్నారు. దేశంలో ఐక్యంగా ఉన్న ఎస్సీలను వర్గీకరణ పేరుతో విడదీయడం కోసమే ఈ తీర్పు వర్తిస్తుందన్నారు. దళిత బహుజనలు కులాలు ఉప కులాలుగా విడిపోతే రాజ్యాధికారం అసలు లక్ష్యాన్ని సాధించలేమన్నారు.

Oplus_131072

దేశంలో 85 శాతం జనాభా ఉన్న దళిత బహుజనలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధిస్తామన్నారు. ఎస్సీ జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుందని ప్రతి రాష్ట్రంలో జనాభాలో వ్యత్యాసం ఉంటుందని రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారన్నారు. గత 30 సంవత్సరాలుగా వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత బహుజన ప్రజాసంఘాలు పోరాటం చేస్తున్నాయని, మాలలలో ఐక్యమత్యం లేకనే
ఈరోజు వర్గీకరణ అనుకూల తీర్పు వచ్చిందన్నారు. ఇకనైనా మాల, మాల ఉపకులాల ప్రజలు మేల్కొని వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కు వ్యతిరేకంగా దేశంలోని అన్ని మండలా లు జిల్లాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తామని. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును పునః పరిశీలించి న్యాయం చేయాలని కోరా రు. ఆర్టికల్ 341 ను సవరణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 341, 342లో ఏవైనా మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు రాజ్యాంగం ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగ మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. 6 గురు సుప్రీంకోర్టు జడ్జి లు రాజ్యాంగ ఆదేశ సూత్రాల కు ప్రతికూలమైన తీర్పు ఇచ్చారని, ఒక న్యాయమూర్తి బేల యం. త్రీవేది మాత్రమే 6 మంది జడ్జీల అభిప్రాయాల తో పూర్తిగా ఏకీభవించలేదని స్పష్టం చేశారు. వర్గీకరణ రాజ్యాంగబ ద్ధంగా లేదని11 మంది న్యాయమూర్తి ల ధర్మాసనం తో తిరిగి పునః పరిశీలన చేసి న్యాయం చేయాలని కోరారు.

Oplus_131072

కటకం రమేష్
రాష్ట్ర కార్యదర్శి

Get real time updates directly on you device, subscribe now.