జేఏసీ సభ్యులకు మంజూరైన గెస్ట్ పోస్టులు

జేఏసీ సభ్యులకు మంజూరైన గెస్ట్ పోస్టులు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్నటువంటి 2022 – 23 విద్యా సంవత్సరంలో అతిథి అధ్యాపకులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో వారికి ఆధ్యాపకులుగా అవకాశం కల్పించాలని సీఎం క్యాంప్ ఆఫీసు నుండి సీసీ కి మరియు కళాశాల ప్రధానోపాచార్యులకు ఉత్తర్వులు అందాయి.

వివరాల్లోకి వెళితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ప్రవేశము పొందినప్పటికీ సాంక్షన్ పోస్ట్లు అతిథులకు సీసీ ఇవ్వకపోవడంతో న్యాయం కోసం జేఏసీ సభ్యులు నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంప్రదించి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి గారు 2023 – 24 ఈ విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకులుగా స్వీకరించాలని సీసీని ఆదేశించారు.

ఈ సందర్బంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. వీరిలో జేఏసీ అధ్యక్షులు ఎల్మల రంజిత్ కుమార్, జోనల్ అధ్యక్షులు త్రిపాటి వెంకట్ రెడ్డి,జేఏసీ సెక్రెటరీ మౌనిక మరియు జేఏసీ సభ్యులు రాము, క్రాంతి, నరేందర్, రవీందర్, మురళీ, దిలీప్, మున్నా తదితరులు వున్నారు.

Get real time updates directly on you device, subscribe now.