శ్రీకాకుళం
తేది.20/01/2025.సోమవారం.
గార శాఖా గ్రంథాలయంలో యర్రన్న విద్యాసంకల్పంలో భాగంగా గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గోండు.శంకర్ గారు ముందుగా స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.
ఎమ్మెల్యే గోండు.శంకర్ గారు మాట్లాడుతూ కింజరాపు యర్రంనాయుడు గారి ఆశయాలకు తగ్గట్టుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు గ్రంథాలయాలకు యర్రన్న విద్యాసంకల్పం అనే పేరుతో బీరువా మరియు పోటీ పరీక్షల పుస్తకములు బహుకరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు, పాఠకులు గ్రంథాలయమునకు వచ్చి పుస్తకములను వినియోగించుకొని మంచి ఉద్యోగాలు పొందాలని కోరారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు గారు మరియు ఉద్యోగులు ఎమ్మెల్యే శ్రీ గోండు.శంకర్ గారిని సన్మానించడం జరిగింది, తదుపరి శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయమునకు వచ్చే పాఠకులకు త్రాగునీరు ఆర్వో ప్లాంట్ కావాలని కార్యదర్శి బి.కుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారిని కోరడమైనది ఎమ్మెల్యే గారు తప్పకుండా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బడగల వెంకట అప్పారావు ఎక్స్ సర్పంచ్, కొంకేన రమణమూర్తి పీ.హెచ్.సి అభివృద్ధి కమిటీ చైర్మన్, గోండు భాస్కరరావు ఎక్స్ ఎంపీపీ, కొంకేన ఆదినారాయణ సర్పంచ్ సాలి హుండం, మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు గారు డిప్యూటీ లైబ్రేరియన్ వి.వి.జి.ఎస్.శంకరరావు గ్రంధాలయాధికారులు ఎన్ రామకృష్ణ, విశ్రాంతి గ్రంథాలయాధికారి ఎన్.ఛాయారత్నం మరియు గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.