గెస్ట్ ప్యాకల్టీ లకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ జారీ చేస్తాం… వాకాటి కరుణ

వాకాటి కరుణ ఆడర్స్

సససెక్రెట్రేట్ హైదరాబాద్, సమదర్శిని న్యూస్ 03.10.2023.

గెస్టులుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో పనిచేస్తున్న వారందరికీ ఎక్స్పీరియన్స్ ససర్టిఫికెట్లు జారీ చేస్తామని,అలాగే నాలుగు గంటలు మాత్రమే వరుసగా పనిచేయాలని ఆరు గంటలు ఎందుకు పని చేయిస్తున్నారని జెడి యాదగిరి గారిని అడిగారు. ఒకవేళ ఎక్కువ
గంటలు పని చేస్తే వారికి జీతం ఎక్కువ కట్టి ఇవ్వాలని అన్నారు.
ప్రతి గంటకు 390 నుండి 700 యూజిసి ప్రకారం పెంచుతామని చెప్పారు. గతంలో ఆర్థిక శాఖ జారీ చేసిన ఉద్యోగాలను వెంటనే పేజ్ ల వారిగా వారం రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాలను కాలేజీ ప్రిన్సిపాల్ మెయిల్ చేస్తామని చెప్పారు. ఆటోమేటిక్ రినివల్ ఉండదని గెస్టు వ్యవస్థను నేను మార్చలేనని అన్నారు. ఇంటర్వ్యూ 3 మెన్ కమిటీ ఉంటుందని దాన్ని తొలగించే అధికారం నాకు లేదని కాలేజీ కామేషనరీట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాకాటి కరుణ గారు చెప్పారు.

జేడి యాదగిరి గారు ప్రిన్సిపాల్ సెక్రటరీ చెప్పింది చేస్తామని అన్నారు. 6వ తేది నాడు 3వ పేజ్ తో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.

3వ తేదీన డీగ్రీ గెస్టు ప్యాకల్టీ జేఏసీ సభ్యులు వెళ్లి కలిసిన సందర్బంగా ఈ పై విషయాలు వెలులోకి వచ్చాయి. ఈ కార్యక్రమం లో జేఏసీ స్టేట్ ప్రసిడెంట్, జోనల్ ప్రసిడెంట్, జనరల్ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.