*కల’ వరించిన భవిత*

రవిరాజు కూడా అసూయ పడే ఆత్మవిశ్వాసంతో, అలుపెరుగని శ్రమను ఆయుధంగా చేసుకుని తన రోజు వారి కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు రాజా… ఎల్లప్పుడూ ఏదో సాధించాలనే తపన తాపత్రయం,తాను చేరాల్సిన కొత్త బంగారు లోకానికి మార్గాన్వేషణ చేసుకుంటూ ఈ కాలం విద్యార్థుల ఆలోచనలకు అందని మనోధైర్యం తో ముందుకు సాగిపోతున్నారు,

“ఏంట్రా రాజా…. ఎపుడూ చదువుతూ బిజిగా ఉంటావేంట్రా కాస్తా మాతో బయటికి రావచ్చు కదా అలా సరదాగా చల్లగాలి కి సేద తీరుదాం,మనిషి అన్నాకా కాస్తా కళాపోషణ ఉండాలి ఒకటే జీవితం కదా,సంతోషంగా గడిపినా బాధగా గడిపినా గతించిపోయినా కాలం తిరిగి రాదు కదా”,”నిజమేరా శ్రీను మనిషి గా జన్మించిన వారు మహానీయునిలా కాకపోయినా మనీషిగా ఐనా బ్రతికి మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలిరా, లేకుంటే ఈ జన్మ సార్థకత కాదు కదరా,””దానికి సమయం ఉందిరా ఇప్పుడు నీ వయసు 18 ప్రాయం కదరా ఇప్పుడే గుర్తింపు కోసం ఆలోచిస్తే తర్వాత నిన్ను ఎవరు గుర్తించరు రా””నను వేరెవరూ గుర్తించవలసిన అవసరం లేదు రా నా విజయం నను గుర్తించి చేరితే చాలు,””ఈ వయసులో అందరు ప్రేమ లో పడుతూ ఎంజాయ్ చేస్తారు రా నువు ఎవరిని ప్రేమించవా,””ఎవరు చెప్పారురా నేను ప్రేమించడం లేదని,నేను ప్రేమిస్తున్నాను,నేను చేరాల్సిన గమ్యాన్ని,ఆ తర్వాత ఎంతో మందికి నేను చూపాల్సిన మార్గాన్ని,ఆ క్షణంలో మా అమ్మ నాన్నల కళ్ళలో పొంగే ఆనందాన్ని,ఇంతకంటే ఏం కావాలి రా జీవితానికి,సమయం కోసం మనం ఎదురు చూడకూడదు,ముందు మనల్ని మనం సిద్ధం చేసుకుంటే సమయం వచ్చినప్పుడు ఆందోళన లేకుండా ఉంటుంది, ఒకసారి విజయం సాధిస్తే నీవన్నట్లు అందరు నను వెతుక్కుంటూ వస్తారు,సరేలే గాని నాదే ముంది ఎటో వచ్చావూ చెప్పురా””ఇది వసంత కాలం కదా మన ఫ్రెండ్స్ అంతా కలిసి అరుకులోయ అందాలు చూడడానికి వైజాగ్ వెళ్ళాలి అనుకున్నాం నువ్వు వస్తావేమోనని వచ్చానురా””నేను గమ్యాన్ని చేరేంత వరకు ఏ అరుకులోయ లేదు అన్ని నా చదువు లోనే చూసుకుంటా మీరు వెళ్ళండి,ఏమైనా ఎమౌంట్ అవసరం ఉంటే చెప్పు అడ్జస్ట్ చేస్తా””మురళీ చెపుతూనే ఉన్నారు రాజా రాడురా అని కాని నేనే వినకుండా వచ్చాను ఒకే రా వెళ్తారా బై”

“ఏంటో ఈ స్నేహితులు ఖాళీ దొరికితే చాలు ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటారు,ఐనా వాళ్ళతో మనకేంటి,ఈ పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం దొరకడమనేది చాలా కష్టం తొ కూడుకున్న పని ఐనా ఏదో ఒకటి సాధించే వరకు ప్రయత్నం ఆపకూడదు,ఏ ఉద్యోగం తొందరగా వస్తుందో ఎవరినైనా సంప్రదించి వాళ్ళ అనుభవం తీసుకుంటే బావుంటుంది,ముందు ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరికినా తర్వాత మనకు మార్గం సుగమం ఔతుంది, అప్పటికే సమయం 11 కావస్తుంది రేపు ఎవరికైనా కలిసి ఆలోచన చేసుకోవాలి అనే తలంపుతో నిదురలోకి జారుకున్నా”

“ఏరా రాజా ఏంటి నాన్న రాత్రి పదకొండు వరకు నీ గది లో లైట్ వెలుగుతూనే ఉంది,నిదుర రాలేదా ఏమైనా ఒంట్లో బాగాలేదా…లే లేచి ఫ్రెష్ అవు నేను కాఫీ తీసుకు వస్తాను అనే అమ్మ పిలుపుతో మెలుకువ వచ్చింది,””అలా ఏం లేదమ్మా రాత్రి కొంచెం ఎక్కువ సేపు చదువుకున్న దాని వలన సమయమే తెలియలేదు,””చూడు రాజా మనకి చాలా ఆస్తి ఉంది నువ్వు కష్టపడవలసిన పనేం లేదు ఇంకా చాలా జీవితం ఉంది నిను పేరు కు తగ్గట్టుగా రాజా లా పెంచాలని కోరుకుంటున్నారు నాన్నగారు నువ్వు ఎందుకు ఇంతలా కష్టపడతావు,””అమ్మా రాజా లా బ్రతకాలంటే ముందు డబ్బు కావాలి అమ్మా అది నేను స్వయంగా సంపాదిస్తే నాకు సంతృప్తి,మీ ఆలోచనలు తప్పు లేదు కాని ఎంత డబ్బు ఉన్నా కూర్చుండి తింటే గుట్టలు కూడా కరిగిపోతాయి,”” అలాగనే నీ చదువు ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు బిటెక్ కూడా పూర్తి చేసుకుని మొన్న ఏదో అల్ట్రా టెక్ కంపెనీ లో జాబ్ 1 లక్ష రూపాయలు జీతం తో వస్తే వెళ్ళకపోతివి కదా,””దానిదేముంది అమ్మా ప్రైవేటు ఉద్యోగం ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతుంది, ఒకసారి డబ్బు మొహం చూస్తే చదువు అటకెక్కుతుంది నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అదైతే పర్మినెంట్ గా ఉంటుంది””ఏమో నాన్నా నీ ఇష్టం కాని ఆరోగ్యం పాడు చేసుకోకు జాగ్రత్త కాఫితీసుకో””సరే అమ్మా నేనూ కాస్త బయటకు వెళ్ళాలి ఉన్నది,నాన్నగారు ఎక్కడ ఉన్నారు,””తను పూజ చేసుకుంటున్నారు,””ఏంటమ్మా నాన్నగారు రోజు క్రమం తప్పకుండా పూజ చేస్తారు తనకు విసుగు రాదా””అవేం మాటలు చిన్నా మన ఇంటి ఇలవేల్పు ఆ శివుడు, శివానుగ్రహం వలననే ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం,నీవు కూడా దండం పెట్టుకొని వెళ్ళు మంచే జరుగుతుంది,””పో అమ్మ…మంచి జరగడానికి మనం మంచిగా ఉంటే చాలు ఇందులో దేవుడు చేసేది ఏం లేదు,””సరే నీ ఇష్టం,”

“మా అమ్మ లక్ష్మి,మా నాన్న ఆనందరావు వీళ్ళకు నేనంటే ప్రాణం,ఆ పరమేశ్వరుడికి వీళ్ళంటే ప్రాణం నాకేమో నమ్మడానికి లేదు, ఒకప్పుడు నాన్న గారికి ఇంతలా నమ్మకం లేకుండే నేను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో లో మనవాళ్ళు అనుకొని నమ్మి పాతిక లక్షల పెట్టుబడి ఇస్తే ఒకరు మోసం చేశారు ఆస్తి పోవడంతో నాన్న జీవశ్చవంలా మారిపోయాడు ఈ ఆ సమయం లో రుద్రాక్ష భార్గవాచార్యులు అనే ఒక పురోహితులను సంప్రదిస్తే అతను పరమేశ్వరుని ఆత్మ (నర్మద బాణ) లింగాన్ని మా ఇంట్లో స్థాపన చేసి రోజు విభూతి ధారణ చేసుకొమని చెప్పారు అలా మండలకాలం చేయగానే అనుకొని మార్పులు మా ఇంట్లో జరిగాయి అప్పటినుండి మా నాన్న దినచర్య లో శివ పూజ కూడా భాగమైంది,అది శివ సాక్షాత్కారం పొందిన ఆ రుద్రాక్ష భార్గవాచార్యులు మాట ఫలితంగా జరిగిందనే నమ్మకం వీళ్ళది నాకేమో కలియుగంలో ఇవన్నీ సాధ్యం ఔతాయా అనే ఆలోచన నాది,ఒక వేళా అదే నిజమైతే ఈ రోజు నేను వెళుతున్న పని సులభంగా పూర్తి చేసుకోని సంవత్సరం లోగా ఏదో చిన్న ఉద్యోగం వస్తే, ఆ భగవంతుని నమ్ముతానేమో చూద్దాం”

“మామయ్య ఏం చేస్తున్నారు…? బాగున్నారా…””రా రాజా ఏంటి ఇవాళ ఇటువైపు వచ్చారు దారితప్పి వచ్చావా తప్పు దారిలో వచ్చావా..””ఏంటి మామయ్య రెండింటి మధ్య తేడా,,,””రాబోయే రోజుల్లో కాబోయే కాలేజీ లెక్చరర్ వి వీటి మద్య తేడా గ్రహించకుంటే ఎలా…””ఏంటి మామయ్య నేను లెక్చరర్ కావడమేంటి నేను ఇంకా కాలేజీ స్టూడెంట్ ని మాత్రమే””ఇప్పుడు స్టూడెంట్ వే కాని నువ్వు ఖచ్చితంగా కాలేజి లెక్చరర్ ఔతావు,ఇంతకీ తేడా ఏంటంటే దారి తప్పి రావడం అంటే ఎటు వెళ్ళాలో తెలియక రావడం,తప్పు దారిలో రావడం అంటే ఈ కాలం స్టూడెంట్ దారులు సినిమా హాల్, పార్క్ లు కదా అటు పోకుండా ఇటు రావడం,చూద్దాం మామయ్య,చూద్దాం కాదు ఈ రోజు కార్తీక సోమవారం, పౌర్ణమి ఈ రోజు నా నోటి నుంచి వచ్చిన మాట ఫలించి తీరుతుంది,”సరే మామయ్య మీరు చేస్తున్న ఉద్యోగం లో చేరాలంటే కాస్త మీ అనుభవాలు కావాలి చెపుతారా,””ఇది చాలా కష్టమైన పని రాజా నీ వలన కాదు, నీకున్న నాలెడ్జ్ కి మంచి ఉద్యోగం వస్తుంది ఇది వద్దు దీనికి ఫిట్నెస్ పెంచుకోవడానికి బాగా హార్డ్ వర్క్ చేయాలి,నీ వలన కాదు,””ప్రయత్నం చేస్తా త్వరలో ఎస్సై రిక్రూట్మెంట్ జరుగుతుంది అంటున్నారు,ఆ లోపు ప్రాక్టీస్ చేస్తాను రాకుంటే చూద్దాం,””ఏం లేదు ముందు కాస్తా ఎక్సర్ సైజ్ చేయి ఉదయం రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి , డైట్ మెనూలో కాస్తా మార్పులు చేయండి, తొందరగా అలసి పోకుండా ఉండడం కోసం నానబెట్టిన గింజలు, డ్రైఫ్రూట్స్,పాలు కాస్త నాన్ వెజ్ అలవాటు చేసుకోవాలి,రెండు నెలలు కష్టపడు సరిపోతుంది,రాత పరీక్ష లో ఎలాగైనా సాధిస్తారు కాని ఈవెంట్స్ పైన దృష్టి పెట్టు””సరే మామయ్య మీ సలహా కి ధన్యవాదాలు వెళ్ళొస్తా…”

“బాబాయ్ చెప్పినట్లు గా ప్రయత్నం చేద్దాం ఎలాగైనా ఏదో ఉద్యోగం సాధించి అందరిముందూ గొప్పగా ఉండాలనే ఆలోచన తో ఇంటికి వచ్చాను, అందుకు సంబంధించిన డైట్ మెనూ, దినచర్య తయారు చేసుకున్న,అమ్మా….””వచ్చావా నాన్న,చాలా సేపు వెళ్ళావు ఏమైంది ఇప్పటికే లేట్ ఐంది భోజనం చేసేవురా,””సరే అమ్మా భోజనం పూర్తి చేసుకొని సరదాగా కాసేపు అలా బయటకు వెళ్ళి వచ్చాను,””రాజా మీ ఫ్రెండ్స్త్ తో అరకులోయ వెళ్ళ లేదా””లేదు కృష్ణా నాకు కాస్త బిజి షెడ్యూల్ లో ఉన్నాను ,””సమ్మర్ హాలిడేస్ లో బిజి ఏంట్రా,””ఇప్పుడు ఐతేనే చదవడానికి కాస్తా సమయం దొరుకుతుంది, త్వరలో కా
ఎస్సై నోటిఫికేషన్ రాబోతుంది చదవాలి రేపటి నుంచి అదే బిజి కాబట్టి ఒకసారి కలుద్దాం అని ఇలా వచ్చాను,””నిజంగా నీవు సార్థక నామధేయుడవురా””హే ఎందుకు కృష్ణా””మరి కాకపోతే ఈ వయసులో ఇలా ఎవరైనా ఆలోచిస్తారా,మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేమో ఇలా,””ఏమోరా నాకు అవేవి నచ్చవు 20 సంవత్సరాల కష్టపడి చదివితే మిగతా 80 సంవత్సరాల ఎంజాయ్ చేయవచ్చు, ఇప్పుడే ఎంజాయ్ చేస్తే తర్వాత కష్టాలను తప్పించుకోవడానికి కష్టం ఔతుంది””సరే నీ ఆలోచనలు బాగానే ఉన్నాయి కాని అందరు ఇలా ఆలోచించరు కదా,””మందిలో మనం కాకుండా,వందలో మనం ఉన్నప్పుడు కదా అసలైన గుర్తింపు వస్తుంది,””ఒకే రా ఆల్ ది బెస్ట్”

“అమ్మా రేపు నను కాస్త ఉదయమే నిదుర లేపూ ఒక ఆరునెలల నను అలాగే వదిలేయండి””సరే నాన్నా అలాగే,””మా అమ్మనాన్నలు అంటే నాకు చాలా ఇష్టం నా ఆలోచన కి ఎప్పుడు అడ్డు చెప్పరు, మరుసటి రోజు ఉదయాన్నే నిదురలేచి నా ప్రయత్నం మొదలు పెట్టాను బాబాయ్ చెప్పినట్లు డైట్ మెయింటైన్ చేస్తు ప్రొక్టీస్ చేస్తున్న, మొదట్లోనే చాలా కష్టం అనిపించింది ఒక్కసారి ఈ కష్టం అవసరమా ఎందుకు ఇవన్నీ అని అనుకున్నాను కాని ప్రయత్నం, ప్రయత్నం లోనే ఓడిపోకూడదని,కాస్త కష్టమైన మంచిదే గమ్యం చేరే ప్రయత్నం చేద్దాం అని మనసు స్థిమితంగా చేసుకుని ఆరునెలల కష్టం తర్వాత నోటిఫికేషన్ వచ్చింది రాగానే ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ మధ్యాహ్నం అంతా చదువే ఆ పీరియడ్ లో చాలా ఇబ్బంది,చాలా సమస్య లు ఎన్నో ఎదుర్కొంటున్న కాని *అనుకున్నా భవిష్యత్తు చేరువ కావాలంటే అలుపెరుగని ప్రయాణంలో అడుగడుగునా గండాలు దాటాలనే* మిత్రుడు స్వరమయూరి మాటలు గుర్తుకు వచ్చి ప్రయత్నం కంటిన్యూ చేస్తున్నా పరిక్ష రాసే రోజు రానే వచ్చింది,ఇది నిజంగా నా జీవితానికి విషము పరిక్ష లాంటిదే,*కర్ణుని చావుకు కారణాలనేకం* అన్నట్లు నేను రాయబోయే పరిక్ష కి కూడా అన్ని అటంకాలే ఐనా ప్రయత్నం మానుకోలేదు,ఫలితం గా *సత్ప్రవర్తన స్వధర్మం ఐతే శాపం కూడా వరమవుతుంది,శ్రమ నీ ఆయుధమైతే విజయం నిను వరిస్తుంది* అనే మాటలు నా విషయంలో నిజమైనాయని వచ్చిన ఫలితాలు విజయపథంలో నను నిలబెట్టింది మొదటి రెండవ స్థానంలో నేను విజయం దక్కించుకున్న, ఇన్నాళ్ళు కష్టానికి ఫలితం దొరికింది, సర్టిఫికెట్ వెరిఫికేషన్, తర్వాత ట్రైనింగ్ అన్ని చకచకా జరిగిపోయాయి, శిక్షణ లో ఇదేం శిక్ష’ ణ అనే సందర్భాలు అనేకం అన్నింటినీ అధిగమించి పోస్టింగ్ తీసుకున్నా”

రచన
Ch thirupathi
చెన్నూరు కవి

Get real time updates directly on you device, subscribe now.