పత్తి శివ ప్రసాద్ గారి కొన్ని కవితలు

సహజత్వం
కనుమరుగయింది
కృత్రిమం తోనే ప్రతీది
అసలు లేక రోగాలే మరి
కాదేది ‘కల్తీ ‘కి అనర్హం
మందు మాకులతో
అలవాటైనా శరీరం లో
స్వచ్ఛత పడితేనే
‘రియాక్షన్ ‘అయ్యే రోజులివి
……………
పత్తి.. 9440001224

నిర్మాణల్లో, పనుల్లో నిత్యం
నిరంతరం శ్రమ కూలీలదే
పేరు మాత్రం మేస్త్రీలకే
సిబ్బంది కృషి తో
అధికారికి ప్రశంసలు
నిర్దేశం నాయకత్వందే అయినా
చిత్తశుద్ధి శ్రమ జీవులదే
రాల్లెత్తిన కూలీలకు
యధాతత జీవితాలే
చేతిదెబ్బ బలమైనా
విడి వ్రేళ్లు కలిస్తేనే
చెయ్యి బలం తెలిసేది
శ్రమను న(అ)మ్ముకొని
జీవించే శ్రామికుడు
కావద్దు శ్రమ దోపిడీకి
…………………..
పత్తి శివప్రసాద్. 9440001224

నేటి రోజుల్లో
అమాయకులు
ఎవరు లేరు
అందరూ
“మాయ”కులే
ఎదుటి వాడి
కుయుక్తులు నమ్మినట్లు
నటించడం తో
మాయగాడి పని బోల్తానే
అక్కర, అవసరం కోసం
బోలాతనం ప్రదర్శన కే
రాజకీయం లో నేతలు
ఆడే నాటకాలు
ఓటర్లకుతెలిసే
తాయిలాల కోసం
అందరికి మా ఓటు మీకేనంటూ
మాయగాళ్లకు కనిపించని
“అ”మాయకులు ఓటర్లు
…………………………….
పత్తి శివప్రసాద్. 9440001224

నేటి*రాజ”కీయం*-
–===——–===
ఉక్కుదుక్క లా
ఉండటం కష్టం
రబ్బర్ లా మెత్తగా
సాగే గుణంతో సులభం
ఎలాంటి వ్యక్తులకైనా
సరిగ్గా లటుక్కున
అతుక్కపోయేందుకు
“ఎలాస్టిక్” డ్రెస్ నయ్యాను
గోడమీద —-లా వున్నాను
ఎటయినా “దూకుడే’
అవసరం కోసం”జోకుడే”
………………………..
పత్తి శివ ప్రసాద్. 9440001224

కళ్ళముందు అన్యాయం
కనిపించినా మౌనమేనా
భరించలేని వేదన లోపలేనా
భయం, ఏమౌతుందోనన్న వైనం
“మౌనం “గడువుకు ఒక హద్దుంది
ఒక్కడి ప్రశ్న తోనే మొదలౌతుంది
మూగ గా ఉంటే నోరు కంపే
అన్ని చూస్తూ ప్రశ్నించలేని గొంతు
అన్నిఉన్నా ల్యాబ్ లోని బొమ్మే
చిరుదీపం చాలు చీకటి మాయం
సంకల్పబలంతో ముందుకు వెళ్తే
నీ వెంటే జనం అన్యాయం పరార్
ఆక్షరం,గొంతు ముందుకు కదిలితే అంకెలుఎన్నో,ఎన్నెన్నోవిజయాలే
………………
పత్తి శివ ప్రసాద్ (నిర్మల్)

నిరంతరం చలనం
నవీన జీవనానికి వాహనం
పరిశ్రమిస్తుంటేనే ఫలితం
వాడకం లేకుంటే మూలకే
‘తుప్పు’ పట్టడం ఖాయం
ప్రతివాడు ‘తప్పు’ పట్టుడే
రాయకపొతే కలంలోని
సిరా మాటుమాయమే
“పని”లో లేకుంటే’పనికి”రావు
మొరాయించే ‘మర ‘లా మారకు
నిత్యం భూ(పరి )భ్రమణం లా
‘ఎరుక ‘తో చైతన్యం లా సాగు
…………………………………
పత్తి శివప్రసాద్ (నిర్మల్)
9440001224

అడుగు వేసే ముందే
లక్ష్యం తోనే ఆలోచించు
అనాలోచితంగా ముందుకు వెళ్తే
ఆలోచనాలోచనాల తో మదనం
దారి తప్పేను నడక
గమ్యం చేరువయ్యేందుకు
క్రియామార్గం ప్రణాళిక అవసరం
ఎడారిలో నడకైతే దారి తప్పడమే
నగుబాటు కే ఆసరా అవకాశం
గులేర్ తో గురి చూసి కొడితే
కార్యసాధనకు వ్యూహం గా
అడుగులేస్తే ఎదురు లేదు
నడక గమ్యం గమనంలో
నిక్కచ్చి నిజాయితీ ఉందంటే
జనం నీవెంటే వెన్నంటే
అడుగులు పరుగులతో
హితం కోరుకొనే దారులు
మార్గదర్శక చేరువులో నీవు
……..
పత్తి శివ ప్రసాద్ 9440001224

అంకురం మొలకెత్తి
పుష్పం లా వికసించి
లతల్లా పెనవేసుకొని
సాగుతున్న అనుబంధాలు
మంచికి ప్రేమ కు తోరణాలు
ఏకతా అనురాగాలు విలసిల్లే
మకరంధాల మాధుర్యాలు
రాను రాను కరువవుతున్నాయ్
“మా”‘మనం”పదాలు దూరమై
“నీ “‘నా “లుగా గమనమైంది
పాత ఓకే అనుభూతి కరువై
కొత్త రోతలు పెరుగుతున్నాయ్
ఎరుక గలమనం గుర్తెరిగినడవాలి
కొనసాగించాలి నాటి బంధాలు
……………….
పత్తి శివప్రసాద్ 9440001224

Get real time updates directly on you device, subscribe now.