అంశము:- శ్రావణ మాసం
☘️☘️☘️☘️☘️☘️☘️
1.ఉత్పలమాల
శ్రావణ మాసమందు శివ సాహితి సన్నిధి ప్రీతి నందగన్ సేవలు లింగధారి కభిషేకము లర్చన మిన్నుతాక నా దేవత లందరున్ ముదము
దీరగ మంత్ర జపాది సూక్తముల్
శ్రీ వర దాతగా నిలిచి జీవుల శ్రేయము పెంపుచేసెడిన్!
2.*కందము*
శ్రావణ మాసము లక్ష్మిది
పావన రూపిణి పదముల వందన మిదియే
దీవెన లీయగ కొలువై
భావి తరముల కిడు కడు విభాసము సతమున్!!
3 *కందము*
మంగళ గౌరికి పూజలు
మంగళ కరముగ స్తుతులను మాతకు హృదిలో
నంగన లందరు భక్తిగ
సంగడి సలిపిరిముర హరిసతి కై భజనల్!!
దేవరాజు రేవతి