పదవతరగతి ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థిని సన్మానించిన *రజిత పరమేశ్వర్ రెడ్డి*

పదవతరగతి ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థిని సన్మానించిన *రజిత పరమేశ్వర్ రెడ్డి*

ఈరోజు ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ *మందుముల రజితా పరమేశ్వర్ రెడ్డి* గారు ఉప్పల్ లోని ప్రజ్ఞాన్ హైస్కూల్ విద్యార్థి పదవతరగతి పరీక్షలో 589 మార్కులు సాధించిన విద్యార్థి మాస్టర్ వలిపే రామ్ చేతన్ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం IOGT చారిటబుల్ ట్రస్ట్ వారి రూ.25,000/- వేల రూపాయలు చెక్కును కార్పొరేటర్ *రజితా పరమేశ్వర్ రెడ్డి* గారి చేతుల ద్వారా విద్యార్థికి బహుకరించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ – ఉప్పల్ ప్రజ్ఞాన్ విద్యార్థి మాస్టర్ వలిపే రామ్ చేతన్ పదవతరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి తమ పాఠశాలతో పాటు ఉప్పల్ కి మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. విద్యార్థులు చేతన్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజ్ఞాన్ యాజమాన్యం నాణ్యమైన విద్యనందిస్తూ ఉత్తమమైన ఫలితాలు సాధిస్తుందని పేర్కొన్నారు.విద్యార్థి తల్లిదండ్రులైన శ్రీమతి వలిపే సత్యనీలిమ, శ్రీ వలిపే లక్ష్మీ నరసింహ రావు గార్లను అభినందించారు.విద్యార్థి అభివృద్ధికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రశంసనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో IOGT చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ దుబ్బ లక్ష్మారెడ్డి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఈవిధంగా ప్రతిభ కనబరిచిన వారిని మా ట్రస్ట్ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని వారి యొక్క పైచదువులకు సహాయ సహకారాన్ని అందిస్తుందని విద్యార్థులు పట్టుదలతో చదువుకుని మంచిపేరు తెచ్చుకోవాలని ప్రసంగించారు.మరియు పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కూడా కృషితో అనుకున్నది సాధించాలని పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరూ ఏదైనా చేయగలరని అనుకున్న గమ్యాన్ని చేరవచ్చునని విద్యార్థులను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు.కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి జెట్ట సుధాకర్ గారు, జనరల్ సెక్రటరీ గోనె ప్రభాకర్ రెడ్డి గారు, సంస్థ సభ్యులు మేకల రాంచందర్ రెడ్డి, మేకల రంగారెడ్డి గార్లు మరియు ప్రజ్ఞాన్ పాఠశాల యాజమాన్యం, సిబ్బంది మరియు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.