నీకు నీవే రారాజువి!!

అంబటి నారాయణ

నీకు నీవే రారాజువి!!”

ఎవరేమి అనుకున్నా
నీవు అనుకున్నది వదలొద్దు!!
నీ పట్టు విడవొద్దు.. మాట జారొద్దు!!
పోగొట్టుకున్నది పొందేవరకు
నిన్ను నీవు మరువొద్దు!!…
ఎక్కడో ఒకదగ్గర నీ కోసం..
అదృష్టం ఎదురుచూస్తూ ఉంటుంది!!..
నీకు నీవే సాటి..నీకు నీవే మేటి!!…

నీకు నీవే ఓ చిత్రం!!
నీకు నీవే ఓ విచిత్రం!!
నీకు నీవే ఓ తత్వం!!
నీకు నీవే వ్యక్తం..అవ్యక్తం!!

అందరినీ ఆదరించే గుణం ఉండాలి!!
ఓ మంచి దారిలో నీ నడక సాగాలి!!
నీవే ప్రాతః కాల సూర్యుడివి…
నీ చూపులతో వెలుగులు నిండాలి…
ఎన్ని ఛీత్కారాలు ఎదురైనా
ఎక్కడో ఓ దగ్గర సత్కారం లభిస్తుంది!!

అందరి కళ్ళలో శాశ్వతంగా నిలవాలి..
ప్రతి ఒక్కరి మనసులో మెదలాలి!!..
నీవే లోకానికి ఉదయం కావాలి…
నీవే మానవలోకానికి హృదయమై మెలగాలి!!…
ఈ జీవితానికి ఓ సార్థకత
ఏర్పరచుకోవాలి!!…

స్వేచ్ఛాయుతంగా జీవించాలి…
బానిస సంకెళ్లను తెంచుకోవాలి!!…
ఈ వ్యవస్థలో వింతలు విడ్డూరాలెన్నో?
లెక్కచేయొద్దు..చిక్కుల్లో పడొద్దు!!…
నీ మనసే నీకు ఆయుధం!!
నీ హృదయమే నీకు బలం!!
నీ ధైర్యమే నీకు రథసారథి!!

ఆశాశ్వతమైన భోగాలు నీ కొద్దు!! కృత్రిమసౌందర్యాలు దరిచేరొద్దు!!
మనసున మనసై బతకడమే ముద్దు!!
మాట మీరొద్దు..నీ హద్దు దాటొద్దు!!

స్నేహం ఎప్పుడు నీలో చిగురించాలి…
మోసం తెలియని నీ మనసు
స్వచ్చంగా ఉండాలి!!…
నీవు నీవే ప్రభావితం కావాలి…
మనోభావాలకు బలాన్ని చేకూర్చుకోవాలి!!….

నీకు నీవే రాజుగా భావించాలి!!…
సమాజాన్ని పీడించే రాక్షసుల పనిపట్టాలి!!…
నీకు నీవే మంత్రివై
దుర్మార్గులను తరిమికొట్టాలి!!..
కాలానికి సమాధానం నీవే కావాలి!!…

లక్ష్యాన్ని సాధించే విలక్షణత ఉండాలి…
సువిశాలమైన హృదయసౌందర్యం అలవరచుకోవాలి!!…
ఏ శక్తి నిన్ను ఉన్నతునిగా చేస్తుందో
ఆ శక్తిని విడనాడకూడదు…
నీ దారిని పూదారిగా మలచుకోవాలి!!.

మానవత్వపు విలువలతో బతకాలి…
నీ జీవిత రహదారి ఎప్పటికప్పుడు
ఓ కొత్తదారి కావాలి..!!
సంచలనాలను సృష్టించే….
రాచబాటగా మార్చుకోవాలి!!…
రారాజుగా కీర్తింపబడేలా జీవించాలి!!…

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

Get real time updates directly on you device, subscribe now.