షేక్ అస్మతున్నీసా దేశభక్తి

తెనాలి

పేరు: షేక్ అస్మతున్నీసా,
ఊరు: తెనాలి,
జిల్లా: గుంటూరు.
ఫోన్:9550898059.
అంశం: దేశభక్తి.

*శీర్షిక: *చమురునే మీ వెలుగుకై*

తలలు తెగుతున్నా, దేహాలు చిధ్రమవుతున్నా,/
దేశం నాదని,నాతల్లికై నా త్యాగమని,/
తృణప్రాయంగా తమ ప్రాణాలర్పించి,
ఉరి కొయ్యలను ముద్దాడి మరీ,/
ఊపిరొదిలిన వీరులెందరో,
వారసులను వీడిన వృద్ధులెందరో,/
దొర్లుతున్న పుటల్లో చెరగని అక్షరాన్నై,/
అలరారాలని అక్కున చేర్చుకోగల అంతాన్ని,/
దాసీతనం పోవాలని, సుఖంగా స్వతంత్రం రావాలని,/
రాజ్యం మాదని, రక్కసితనం పోవాలని,/
బ్రిటిష్ వారి బానిసపాలన ఏంటని,/
వ్యాపారమని వచ్చి, వ్యూహ ప్రతి వ్యూహాలతో,/
మా శరణు జొచ్చిన మీరే మమ్మాక్రమించి,/
దొరలంటూ ఎలా దోచుకుంటారని,/
తరలిపోవాలని, తప్పక గద్దె దిగాలన్న పోరాటమే..
దొర్లుతున్న పుటల్లో చెరగని అక్షరాన్నై /
అందరి మన్ననలు, పేరు ప్రఖ్యాతులు పొందాలన్న ప్రీతి లేదు./
ఉద్యమకారుడినై, ఓ వెలుగు బావుటానై,/
నా భారతజాతికి జీవం పోయాలని,/
జీవితాన్ని ధారపోసిన దీపాన్ని, దివిటీని./
ప్రజల దాస్య శృంఖలాలను త్రెంచి, స్వేచ్ఛ నివ్వాలని,/
మరణన్నైనా లెక్కచేయక,
ఎంచుకున్న మృత్యువుని./
దొర్లుతున్న పుటల్లో చెరగని అక్షరాన్నై చరిత్ర సృష్టించాలని కాదు..
చావును గెలవాలని, చమురునై మీకు వెలుగునివ్వాలని…

ఇది నా స్వీయ రచనే అని దేనికీ అనుకరణ కాదని హామీ ఇస్తూ..
షేక్ అస్మతున్నీసా,
M.A, BE.d.
తెలుగు టీచర్&కవయిత్రి,
తెనాలి మండలం, గుంటూరు జిల్లా.
చరవాణి:9550898059.

Get real time updates directly on you device, subscribe now.