ప్రకృతి మానవాతీతం
నవ చైతన్యపు జీవరూపశృతికి ఆజ్యమై
నాజూకు సుకుమారపు లతల సంద్రమై
నిమీలిత నడకల సింగారము పెంచుచుఁ ఈ
నవ రత్నాలు మానవ హిత కారకాలు
నూతనోత్సాహపు హొయలు విరాజిల్లుతూ
నీలి ఆకాసాన అంతులేని కారుమబ్బుల
నాకర్షింప తన్మయత్వపు కౌగిలి నివ్వుచుఁ ఈ
నవ రత్నాలు మానవ హిత కారకాలు
నా దరహాసపు కొంగ్రొత్త చిగురు విస్ఫోట
నాకృతి విశ్వ మంత విస్తృతమవ్వాలని
నేనే ప్రకృతినై సృష్టినై పరిఢవిల్లుచుఁ ఈ
నవ రత్నాలు మానవ హిత కారకాలు
రచన
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
నవ రత్నాలు రూప కర్త
9849808757
∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞
నవ రత్నాలు
1. దీనిలో 4 వరుసలు ఉండాలి
2. ప్రతి వరుసలో 10 నుండి 16 అక్షరాలు రావాలి
3.న గుణింతాము తో 1,2,3 వరుసలు మొదలవ్వాలి
4. చివరి వరుసలో
నవ రత్నాలు మానవ హిత కారకాలు అనే మకుటం రావాలి
100 రాసిన నవ రత్నాలు పురస్కారం
1000 రాసిన సరస్వతీ పుత్రులు పురస్కారం ఇవ్వబడును