తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారి పోటిల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాట్ల విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు నిర్వహించిన పోటిల్లో ప్రతిభ కనపర్చి రికార్డ్ సృష్టించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాట్ల విద్యార్థులు :

బాలల దినోత్సవం సందర్బంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు శ్రీమతి కోడూరి శాంతమ్మ సాంస్కృతిక బాలోత్సవం అంగరంగా వైభోగంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల పిల్లలు కథలు, వచన, పద్య కవితలు, ఏకపాత్రాభినయం , చిత్ర లేఖనం, వ్యాస రచన,ఉపన్యాస, పుస్తక సమీక్ష, నృత్యం,పాటలు వంటి పోటీలలో దాదాపు పన్నెండు వందల మంది పాల్గొన్నారు.ఈ సందర్బంగా రాష్ట్ర స్థాయిలో మహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 1.జంపాల కావ్యశ్రీ( పదవ తరగతి )తన అద్భుత ప్రతిభతో ఆటవెలది చందస్సులో పద్య కవిత్వం, ఉపన్యాస, ఏక పాత్రాభినయం(తాగుబోతు పాత్ర ), వ్యాసంలలో ప్రధమ స్థాయిలో నిలిచి మొత్తం నాలుగు నగదు బహుమతి తీసుకోవడం విశేషం.2.టేకు ఉషారాణి( పదవ తరగతి ) వచన కవితలో ప్రధమ స్థానం నగదు బహుమతి, 3.శేరు శ్రావిక (పదవ తరగతి )కథలలో ప్రధమ నగదు బహుమతి, 4.తూర్పాటి నవ్య శ్రీ (తొమ్మిదవ తరగతి )పుస్తక సమీక్ష ప్రధమ నగదు బహుమతి, 5.కీర్తి కిరణ్( తొమ్మిద వతరగతి )ప్రత్యేకప్రోత్సాహక బహుమతి ప్రశంషా పత్రం, 6.ఆకుల పాల్ జోషప్ (తొమ్మిదవతరగతి )7.ఆకుల జాన్ జోషఫ్ (ఏడవ తరగతి )8.పస్తం స్టేవిన్ (ఎనిమిదివ తరగతి )వారు చిత్ర లేఖనంలో, 9.బొబ్బిలి మానస (తొమ్మిదవ తరగతి )కథలో, భాషబోయిన ఈక్షిత (తొమ్మిదవ తరగతి )వచన కవిత్వంలో ప్రత్యేక ప్రశంషా పత్రాలు పొందారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, శాంతా వసంతా ట్రస్ట్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత మనందరికి హైపటైటిస్ బి ఇంజక్షన్ కనుగొని అతి తక్కువ ధరకు అందించిన మహామనిషి డా. కె. ఐ. వరప్రసాద్ రెడ్డి, తెలంగాణ మాజీ ప్రభుత్వ సలహాదారుడు కె. వి. రమణ చారి చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంషా పత్రం, నగదు బహుమతి అందుకున్నారు. ఈ సందర్బంగా పరిషత్ కోశాధికారి రామారావు, ప్రముఖ బాలసాహితీ వేత్త గరిపెల్లి అశోక్, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య తదితరులు పాల్గొని గెలుపొందిన విద్యార్థులని అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మూలకారకుడు పిల్లల ప్రతిభను ప్రోత్సహించిన బాల సాహితి వేత్త, కథ రచయిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్మవరపు కృష్ణయ్య, కవి, రచయిత, విశ్లేషకుడు ఉపాధ్యాయుడు కొంపెల్లి రామయ్య, తెలుగు ఉద్యయురాలు మారపెల్లి సునీత పిల్లలను వివిధ పోటీలలో పాల్గొనుటలో, వారిని ఈ కార్యక్రమంకు తీసుకొని పోవడం లొ, సహకారం అందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఈ రోజు ప్రధానోపాధ్యాయులు కొమ్ము వరపు కృష్ణయ్య అధ్యక్షతన గెలుపొనందిన విద్యార్థులకు అభిందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రేపటి భావి భారత పౌరులు అయిన పిల్లలు చదువుతో పాటు సహ పాఠ్యంశాలలో కూడా ముందు ఉండాలని, తద్వారా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆ దిశాలలో మా ఉపాధ్యాయులు కృషి చేయడం అభినందనీయమని, ఇంకా భవిష్యత్తు లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపాలని విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు రాపోలు విజయ్ కుమార్, గుర్రపు స్వప్న, కొత్తపల్లి రమేష్, చిట్ల ప్రేమ్ కుమార్, మారేపల్లి సాయి కుమార్, ఎస్ కె రోషిణి, దోమల యాకస్వామి, బోనాలా రిషిత,పిల్లల తల్లి దండ్రులు తదితరులు అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.