తుమ్మల దేవరావ్ కు జాతీయ విమల సాహితీ సాహిత్యపురస్కారం

ISBN NEWS

సమదర్శిని న్యూస్ నిర్మల్ టౌన్ :
తుమ్మల దేవరావ్ కు జాతీయ విమల సాహితీ సాహిత్యపురస్కారం ప్రధానం

జాతీయ స్థాయిలో సాహిత్య రంగంలో కృషి చేస్తున్న వారికిచ్చే విమల సాహితీ సాహిత్య పురస్కారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, చరిత్ర పరిశోదకుడు, ఉపాధ్యాయుడు dr తుమ్మల దేవరావ్ అందుకున్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన్ భవన్ లోని దొడ్డి కొమురయ్య మీటింగ్ హాలులో అవార్డు ప్రధాన సభలో ప్రజావాగ్గేయకారుడు, ప్రముఖ కవి, తెలంగాణ శాసన మండలి సభ్యులు గోరేటి వెంకన్న, రిటైర్డ్ వైస్ చాన్సలర్, ప్రముఖ రచయిత dr కోలుకలూరి ఇనాక్, బాహుబష కవి, ప్రముఖ అనువాదకుడు ప్రొ #GV రత్నాకర్, ప్రముఖ కవి, వక్త dr కోయి కోటేశ్వర్ రావ్, కళా శ్రష్ట బిక్కి కృష్ణ, ప్రముఖ కవి, సంస్థ అధ్యక్షులు dr జెల్ది విద్యాదర్ (IRS )ప్రముఖ కవి DR దేవయ్య (కర్ణాటక ) తదితరులచేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్బంగా పురస్కార గ్రహీతల రచనలు ఏ బాష సాహిత్యం తో పోల్చలేనంత గొప్పగా ఉన్నాయని కొనియాడారు. తుమ్మల దేవరావ్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పురస్కారలు అందుకున్నారు.అనేక పరిశోదనా వ్యాసాలు రచించారు. కచ్చురం, గడ్డిపూలు, మట్టిపాదాలు, నిర్మల్ జిల్లా సాహిత్య చరిత్ర, నిర్మల్ కథలు తదితరపుస్తకాలు విలువరించారు. ఈ సందర్బంగా నిర్మల్ సాహితీ మిత్రులు dr చక్రదారి, dr దామెరరాములు, పత్తి శివప్రసాద్, నేరెళ్ల హన్మంతు, రాజేశ్వర్ రెడ్డి తదితరులు అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.