భారీగా డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకుల నియామకంలో కోత

Hyderabad news

ఈ సారి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధి లోపల డిగ్రీ అడ్మిషన్స్ తగ్గడంతో తెలంగాణ అతిథి అధ్యాపకుల నియామకంలో భారీ సంఖ్య తగ్గనుంది. ఎందుకంటే డిగ్రీ ప్రవేశాలు పూర్తిగా లేక పోవడం వల్ల భారీగా గెస్ట్ పోస్టుల మంజూరు కూడా తగ్గే విధంగా సూచనలు అందుతున్నాయి ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 1900 పైననే పోస్టు ఉండడం విశేషం కానీ చాలా కాలేజీల్లో అడ్మిషన్స్ 2025- 26 ఈ సంవత్సరం లేకపోయేసరికి రానున్నటువంటి గెస్ట్ పోస్టులన్నీ కూడా రాకుండా పోయే ప్రమాదం ఇప్పుడు పొంచి ఉన్నది దాదాపు 1940 నుంచి ప్రారంభమైనటువంటి గెస్ట్ పోస్టులు ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఎనిమిది వందలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అన్ని విశ్వవిద్యాలయాల్లో 64 కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్స్ జీరో అడ్మిషన్స్ అయ్యాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిధిలో 22 డిగ్రీ కళాశాల అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 13 కళాశాలలు . తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎనిమిది డిగ్రీ కళాశాల, పాలమూరు పాలమూరు విశ్వవిద్యాలయంలో ఐదు డిగ్రీ కళాశాల అలాగే శాతవాహన విశ్వవిద్యాలయంలో రెండు డిగ్రీ కళాశాల మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 20వేల 260 అడ్మిషన్లు ఖాళీలు ఏర్పడనున్నాయి. సుమారు 670 పోస్టులు రాకుండా పోయే అవకాశం కనిపిస్తుంది. గతంలో 1400 పోస్ట్లు వచ్చి ఉంటే 800 పోస్ట్లు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా భారీగా డిగ్రీ గెస్ట్ పోస్టులు తగ్గే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో పెరిగిన అడ్మిషన్స్ ప్రకారం గెస్ట్ పోస్టులు కూడా పెరగనున్నాయి. దీనిపై లోతైన అధ్యయనం చేయడానికి ఎన్ని పోస్టులు ఇవ్వాలని తర్జనభర్జన పడుతూ రాష్ట్ర ప్రభుత్వం (cce) వారం రోజులు సమయంలో 3మెన్ కమిటీ త్వరలో వేస్తున్నామని జేడీ చెప్పారు. తెలంగాణ గెస్ట్ ఫ్యాకల్టీ యూనియన్ సభ్యులు డాక్టర్ రంజిత్ కుమార్ తిరుపతి రెడ్డి అందించిన వివరాల ప్రకారం ఈ క్రింది సమాచారం తెలుస్తోంది. యూనియన్ సభ్యులు మాత్రం 12 నెలల సాలరీ తో పాటు త్రీ మెన్ కమిటీ లేకుండా రెన్యువల్ ఇవ్వాలని సిసిఈ ని కోరినట్టు తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.