మళ్లీ ఎప్పుడు పుడుతామో…
మళ్లీ ఎప్పుడు పుడుతామో ఏమో
ఎన్ని జన్మల తర్వాత ఈ జన్మ ఎత్తామో
గతజన్మలో మనమే జంతువులమో
కోతి నుండి పుట్టాడు మానవుడు అంటారు
ఔనేమో నిజమే నేమో
ఏ మైనా చేద్దామ్ తోటి వారికి సాటి వారికి
మాట సాయం చేద్దాం మూట కావాలిగా మనకు
సానుభూతి చూపుదాం ఖర్చు లేని పని
ప్రవచనాలు వల్లిద్దామ్ శ్రమ లేని పని
నిద్రలోకి జారుకున్నాను
కలలు కంటూ
భళ్ళున తెల్లారింది
పనుల్లో పడి పోయాను
ఎవరి బతుకు తెరువు వారే కదా వెతుక్కోవాలి
పరాన్న జీవులు గా బతకడం ఎందుకు
కాయ కష్టం చేయొచ్చుగా కడుపు నింప
బద్దకిష్టులకు మనమేమి చెప్పుతామ్