కదిలించావే కరిగించావే ….ప్రసాద్

సినిమా పాట


🌿🌼☘️🌸🍀🌷🍃🌾🍂🌻

*పాట:-*

*పల్లవి:*

కదిలించావే కరిగించావే
నా గుండెనే
నడిపించావే నవ్వించావే
నా తనువునే
అర్థం కాని అద్దం నేను
భావం తెలిపే బతుకే నీవు…!(1)

*అను పల్లవి:*

వినిపించావే వెతికించావే
వికసించిన నన్నే
బాధించావే బోధించావే
బదులుగా నీవే
సవ్వడి లేని సంద్రం నేను
కాలం గడిచిన బరువే నీవు…!!(1)

కదిలించావే… బతుకే నీవు…!(1)

వినిపించావే… బరువే నీవు…!!(1)

*చరణం:1*

పలకరించావే పులకరించావే
నాకే నీవే
చనువిచ్చావే చూపించావే
నిన్నే నాకై
సిద్ధంగా లేని చిత్రం నేను
రాగం వీడని పలుకే నీవు…!(2)

కదిలించవే.. బతుకే నీవు…!(1)

*చరణం:2*

దరిచేరావే దేవతవే
దూరమైన బంధమే
దరిదాపుల్లోనే దరిచేరే
దివిగా నేనై
కవ్వమే లేని క్షీరసాగర మథనమే
కవితలై పరిచిన నది సారమే నేను…!!
కవితలై పరిచిన కవి(కాళిదాసు)నే నేను…!!(2)

వినిపించావే… బరువే నీవు…!!(1)

-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-
Lyrics / Lyricist ✍️
– Dr. Dhavala V.S.S.S.R.Prasad
Suresh(Rjy)
Mob:9492754546

🍁🌼🍂🌻🍂🌺🎋🌹🌾💐

Get real time updates directly on you device, subscribe now.