పట్టణ సుందరీకరణ పేరుతో ప్రజా దనం దుర్వినియోగం.

రామగుండం

Press note : 20-10-2022

పట్టణ సుందరీకరణ పేరుతో ప్రజా దనం దుర్వినియోగం.

– ముందు చూపు లేని రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గం.
– ఖని లో న్యూ ఇండియా పార్టీ నిరసన
……

గోదావరిఖని మార్కండేయ కాలనీ రాజేష్ థియేటర్ టి జంక్షన్ కూడలి లో సుందరి కరన పేరుతో రోడ్డు నడి మధ్యలో తవ్వి ప్రజలను ఇబ్బంది పెట్టడాన్ని నిరసిస్తూ న్యూ ఇండియా పార్టీ గురువారం కూడలి వద్ద నిరసన ధర్నా చేపట్టింది. అనంతరం రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ ప్రాంతంలో కాలేజీలు ఆసుపత్రులు, సిమెంట్ గోడన్స్ అధికంగా ఉన్నందున బారి వాహనాలకు నూతనంగా నిర్మించే కూడలి లో కనీసం తిరిగే అవకాశం లేదని అలాగే వాహనదారులకు ఇబ్బందిగా మారనుంది ఈ అనాలోచిత నిర్మాణాన్ని ఖండిస్తూ న్యూ ఇండియా పార్టీ ధర్నా తో నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి నిర్మాణ పరిమితిని తగ్గించాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగినది.ఈ కారిక్రమాన్ని ఉద్దేశించి న్యూఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా.జె.వి. రాజు మాట్లాడుతు ముందు చూపులేని రామగుండం మున్సిపల్ కార్పోరేషన్
ప్రజల ధనం దుర్వినియోగంచేస్తు
ప్రజలని అసౌకర్యానికి గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది అని మండిపడ్డారు. పట్టణ సుందరికారణ చేయడానికి మేము వ్యతిరేకం కాదు కాని సుందరికారణ చేయడానికి చాలా ఉన్నాయి ఉదా: గోదావరి తిరప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యొచ్చు అవసరంలేని కట్టడాలు కట్టి ప్రజలని ఇబ్బందులకు గురి చేయకూడదు అని సూచించారు లేని పక్షంలో న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో కార్పోరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కారిక్రమంలో న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు వేముల అశోక్, బి గోపాల్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి , నాయకులు విక్రంసింగ్, ఆషాడం ముకేశ్, మదరబోయిన బాణయ్య, బోగిరి పొశం , పటేల్ , స్టాలిన్ ,ఆర్ నర్సయ్య ఆకాశ్ హృదయ్ రాచకొండ జై చంద్ర ,శ్రావణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Get real time updates directly on you device, subscribe now.