శీర్షిక :- అందని తీరం
గాజుల నరసింహ
నాకలం శ్రమిస్తూ వుంది అహర్నిశలు
స్వప్నాల చిత్రాలను వర్ణిస్తూ అనుదినము
ఆకాంక్ష శిఖరాల కోసం అన్వేసిస్తూ…
నాపాదం కదులుతూనే వుంది నిరంతరము
కాసింత ప్రేమకోసం నా గుప్పెడు గుండె ఎదురు చూస్తుంది
అందమైన ఆత్మీయత కోసం నా మనస్సు తపిస్తుంది క్షణం క్షణం
నా ఊహలకు అతీతమై నా హృదయ సామ్రాజ్యానికి రాణివై
నిధురించే చెలివో నూవ్వెక్కడ ఉన్నావో కదా యెలా ఉన్నావో కదా..
చిరుగాలి కబురులు చిగురంతైనా లేవు
నీ చిలిపితనపు పలుకులు కొసరంతైనా లేవు..
లోకాల తీరాలు దాటి గగనాల అంచులు తాకి అలసిపోతున్నా
కలలరూపాలు తిలకిస్తూ నాలోనేనే మురిసిపోతున్నా..