నిర్మల్ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన విద్యార్థులు

www.samadarshini.com

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున క్షేత్ర పర్యటనలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించడం జరిగింది.


దీనికి కళాశాలలో ని సైన్సు విభాగం విద్యార్థులు మరియు డాక్టర్ జె భీం రావు, జంతు శాస్త్ర అధ్యాపకులు నరేందర్, వృక్ష శాస్త్ర అధ్యాపకుడు పవన్ కుమార్ సందర్శించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలో ఉన్న వివిధ ప్రయోగశాలు, రక్త నిధి కేంద్రం, అత్యవసర విభాగం, ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ విభాగం, రక్త పరీక్ష విభాగం, పీడియాట్రిక్ విభాగం, ఓ పి సేవల పని తీరును గురించి ఆసుపత్రి విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి మరియు ఆర్ ఎం ఓ వేణుగోపాల కృష్ణ, మాధవి, సాయితేజ, రాకేష్, భారతి, శోభ, అభూ అమీర్ లు విద్యార్థులకు విభాగాల్లో పనితీరును గురించి స్పష్టంగా వివరించారు. అని కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.