పామిడిలో సరస్వతి జయంతి వేడుకలు
——————————————-
సమదర్శిని పామిడి,న్యూస్ జనవరి :26
సమస్త విద్యలకు, సకల అశేష విజ్ఞానధాత్రి సరస్వతి జయంతి వేడుకలు పామిడి లో ఘనంగా చేపట్టారు . వైష్ణవి దేవాలయంలో సాత్విక గుణ స్వభావి సరస్వతి, ఆయుధం చేపట్టని దేవత ఆమె అని సరస్వతి విద్యామందిరంలో అంటూ అనుంపల్లి భాస్కర రావు కొనియాడారు. 70మంది చిన్నారులకు అక్షరాబ్యాస కార్యక్రమం చేపట్టారు. అలాగే నిట్టూరు నిలయం పాఠశాలలో 40మందికి అక్షరాబ్యాసం చేశారు.
వైష్ణవి దేవాలయానికి రిటైర్డ్ సి ఐ వరదప్ప, అన్నమ్మ దంపతులు చేకూర్చిన సరస్వతి దేవి కాంస్య విగ్రహనికి అభిషేకం, అర్చన, పూజలు, విశేష పుష్పలంకారం చేసి మహా మంగళ హారతి అర్చకులు రాము, చంద్ర, స్వాములు గావించారు. శాంతికి చిహ్నమైన ధవళ వర్ణ విభూధి తో భోగేశ్వర స్వామి ని అలంకరించి, సరస్వతి ధరించిన వీణ గుర్తును బొట్టు గా చిత్రీకరించి అర్చకులు చంద్ర, అనిల్, జగదీష్ లు పూజలు చేశారు. ఈ కార్యక్రమాలలో సునీల్ కుమార్ రెడ్డి, చౌడయ్య, ఓంకారప్ప, శ్రీనివాసులు, తులసీ బాయి, ఆలయం లో నారాయణ మూర్తి, పూల ఓబిలేసు బృందం వారు పాల్గొన్నారు.