కవిత హృదయ శిల్పి పింగళి గంగాధర్
మౌనంలోంచి మహాసముద్రపు కెరటంలా
కవిత్వంలో నుండి కవిత హృదయ శిల్పంలా
శోధనలో నుంచి పరిశోధన ప్రణవంలా
ప్రభవించిన ఉషోదయం ఇతను.
భావితరాలకు బాటలు వేసే తాత్వికతతో ఆధునిక కాల్పానికి నికేతర వచన సాహిత్యం పై పరిశోధన చేశారు డాక్టర్ పింగళి గంగాధర్ రావు విజయలక్ష్మి మార్తాండరావు పుణ్య దంపతులకు పోతంగల్ గ్రామం కోటగిరి మండలం నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు 1988వ సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్నప్పుడు తెలుగు ఉపాధ్యాయుని ప్రోత్బలంతో అంతిప్రాసలతో కవితలు రాయడం ప్రారంభించాడు తన చిన్న మనసులో సమాజాన్ని గురించి ఇలా వ్రాశాడు.
ప్రపంచం అనేది ఒక వింత పరిశీలిద్దాం దాన్ని మనం అంతా అంతరాళంలో అవుతుంది అది అనువంతా అందులో పరిశీలించే మనమెంత
అనే ఇటువంటి భావాన్ని వ్యక్తపరచాడు ఈ బాల కవి కాలాను క్రమంలో వచన కవిత్వాన్ని విరబోయించాడు ఇంటర్మీడియట్ లో ఉండగా భద్రాచలం చేయమని తన చిన్నమ్మ చిన్నాన్నలైన కల్పన మోహన్ రావు ప్రోత్సాహంతో రచనలు చేయడం ప్రారంభించాడు అంతే మొదటగా ఆటవిలది తేటగీతి పద్యాలు రాసి ప్రత్యేక విగా అవతరించాడు తర్వాత కొంతకాలం తర్వాత ఉత్పలమాలలు కూడా రచించడం జరిగింది. వీటితోపాటు కర్తవ్యం అనే కథను రసవత్తరంగా రాసి మంచి కథకుడా అనే పేరును పొందాడు.
తాత్విక ప్రబోధాత్మకమైన రెండు వచన కవితలు కళాశాల వార్షిక సంచికలో ముద్రణ పొందాయి తెలుగు ఉపాధ్యాయులైన మోహన్ ప్రసాద్ వల్ల గతకులుగా మారిపోయారు డాక్టర్ పింగళి గంగాధర్ కాసర్ల నరేష్ రావు నిజామాబాదులో జరిగిన ఒక కమిషన్ కవి సమ్మేళనానికి తీసుకెళ్లారు ఆఖరి కార్యక్రమంలో మొదటిసారిగా కవులందరిని సమక్షంలో ఒక కవిత చదివి అందరి మన్ననలు పొందాడు తెలుగు భాష పై అభిమానంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్నాతకున్నత విద్యను అభ్యసించాడు అప్పుడే సాహిత్య అధ్యయనం చేయడం ప్రారంభించాడు పరిశోధన వైపు దృష్టిసారించి డాక్టరేట్ పట్టణం పొందడం జరిగింది.
వ్యాస కర్త
డాక్టర్ రంజిత్ కుమార్ ఎల్మల
తెలుగు అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్
9849808757