*ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన*
మేడ్చల్ జిల్లా ఉప్పల్ పట్టణంలోని ప్రజ్ఞాన్ ది స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా 4వతరగతి నుండి 10వతరగతి వరకు గల విద్యార్థులతో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగింది. విద్యార్థులు పలురకాల సైన్స్ ఫార్ములాలు ఉపయోగించి ఎంతో చక్కగా తయారుచేశారు. వారు ఏవిధంగా తయారుచేసారో ఎలా వాటిని ఉపయోగించాలో కూడా చక్కగా వివరించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరుణ్ జయసూర్య, శ్రీమతి శకుంతల, శ్రీమతి నళిని గార్లు విద్యార్థులు చేసిన పరికరాలను,ప్రయోగాలను పర్యవేక్షించి అభినందనలు తెలిపారు. పిల్లలలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసి వారితో ఇలాంటి ప్రయోగాలను చేయించిన సైన్స్ టీచర్ రుక్సానా గారిని అభినందించారు. మిగిలిన విద్యార్థులు ఈప్రయోగాలను తిలకించారు.ఈకార్యక్రమంలో ఎలిజబేత్ ,సత్యనీలిమ, సుజాత, సుమ,శోభన్ బాబు, యాసిన్, సంతీష్,ప్రమీల,స్రవంతి,సునీత, సువర్ణ, టీనా,రోజా తదితర ఉపాద్యాయిని,ఉపాద్యాయులు పాల్గొని పిల్లలను ప్రోత్సహించి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసారు.