జగిత్యాల జిల్లా కేంద్రం లో వర్గీకరణ కమిటీ శక్తుల దిష్టి బొమ్మల దగ్ధం

జగిత్యాల జిల్లా కేంద్రం లో
వర్గీకరణ కమిటీ శక్తుల దిష్టి బొమ్మల దగ్ధం

జగిత్యాల జిల్లా కేంద్రం డాక్టర్ బి అర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్ సి, ఎస్ టి వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి మరియు ఉత్తం కుమార్ రెడ్డి వర్గీకరణ కమిటీ సభ్యుల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు
ఎస్సి ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ ఆగష్టు 1న సుప్రీం కోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వెనక్కు తీసుకోవాలని ఈ తీర్పు కోర్టు ఇచ్చింది కాదని నరేంద్రమోడీ బిజెపి ప్రభుత్వం ఇచ్చిన తీర్పు ఆని కలిసి ఉన్న దళిత బహుజనులను విడదీయడానికి చేసిన కుట్రని కాబట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారిది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి ది వర్గీకరణ కమిటీ చైర్మన్ ఉత్తం కుమార్ రెడ్డి కమిటీ సభ్యుల దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగిందన్నారు
బిజెపి డబుల్ ఇంజన్ ఉత్తర ప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం మరియు మెజార్టీ గా దళిత గిరిజన జనాభా ఉన్న రాష్ట్రంలో అక్కడ చేయకుండ తెలుగు రాష్ట్రాలలో ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు వర్గీకరణకు బీజం పోసిందే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఆని తరువాత తెలుగు రాష్ట్రాలలో కలిసి ఉన్న దళిత వర్గాలను విడగొట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి చంద్రబాబు నాయడు ఆని అన్నారు ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ లను తొలగించడానికి మంద కృష్ణమాదిగ గారిని అడ్డం పెట్టుకొని వర్గీకరణను తీసుకొచ్చారని అన్నారు అందుకే అదే కోవకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అందరికన్నా ముందు వరసలో బిజెపి నరేంద్ర మోడి మెప్పు పొందటానికి ఏకంగా ఉత్తం కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వర్గీకరణ కమిటీ వేశారని అన్నారు అందుకే వర్గీకరణ కమిటీనీ రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ను వెనక్కు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు
అదేవిధంగా దళిత ద్రోహులు వర్గీకరణ ద్రోహులు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయకుండా కొంత మంది ఏజెంట్లను అడ్డం పెట్టుకొని మాజీ ఎంపి చెన్నూర్ ఎంఎల్ఏ గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీ కృష్ణ బెల్లంపల్లి ఎంఎల్ఏ గడ్డం వినోద్ కుటుంబాన్ని దళిత సమాజం నుంచి వేలివేయాలని అదేవిధంగా వర్గీకరణ కమిటీని రద్దు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ హుసేన్ సాగర్ లో ముంచాలని గవ్వల శ్రీకాంత్ దళిత సమాజానికి పిలుపునిచ్చారు మరియు ఈ నెల 30న జరిగే చలో సచివాలయం హైదారాబాద్ ను వేలదిగా తరలి వచ్చి జయప్రదం చేయాలని అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని వర్గీకరణను వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ కోరారు
దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమములో అల్ ఇండియా ఎస్సి ఎస్టీ అడ్వకేట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుల రాజలింగం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ల రమేష్ వంచి బహుజన ఆఘాడి (విబిఏ) మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షులు తీగల శేఖర్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి సూర్యవంశీ విద్యాసాగర్ పార్టీ మరియు మాల మహానాడు జగిత్యాల జిల్లా కార్యదర్శి దాసరి వెంకటి తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.