తెలుగు సాహితీ క్షేత్రంలో ప్రక్రియ “ముత్యాలహారం” – రాథోడ్ శ్రావణ్

Samadarshini.com

*తెలుగు సాహితీ క్షేత్రంలో ప్రక్రియ “ముత్యాలహారం” – రాథోడ్ శ్రావణ్*

తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు పద్యం, గద్యంతో పాటు వచన కవితకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.వచన ప్రక్రియలో అనేక మార్పు చేర్పులకు గురియవుతు విభిన్న రూపాల్లో చిన్న చిన్న కవితలుగా ఉద్భవిస్తున్నాయి. వీటిలో కొన్నింటికి విశేషమైన అదరణ లభిస్తుంది. తెలంగాణ ప్రాంత ప్రజల జీవభాషయైన మాండలిక భాషా పదాలను, వ్వవహరిక భాషా పదాలు సామాన్య ప్రజలకు కుడా అర్థం అయ్యే విధంగా ఉండడం వలన సాహితీ వేత్తలకు తొందరగా చేరదవుతున్నారు. కొన్ని రకాల చిన్న కవితల్లో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు . మరికొన్నింట్లో అక్షరం ,పాదం,ప్రాస ,నిర్బంధాలతో ముడిపడి సాహిత్యకాశంలో ప్రకాశిస్తున్నాయి. ప్రముఖ తెలుగు కవులు సోమనాథుడి–ద్విపదలు, గురజాడ–ముత్యాలసరాలు, ఆరుద్ర–కునలమ్మపదాలు, యన్ గోపి–‌నానీలు, భీంపల్లి శ్రీకాంత్– మెగ్గలు,వంటి కవితా భాగాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.తిరుమల శ్రీనివాసాచార్య, సామల సదాశివ, ఏనుగు నరసింహారెడ్డి మొదలగు వారితో– రుబాయిలు స్థిరపడ్డాయి.జాదవ్ పుండలిక్ రావు –చిమ్ని గోష్కులా రమేష్ – కైతికాలు, వడిచర్ల సత్యం,–మణిపూసాలు, డా,ఎల్మలా‌రంజిత్ కుమార్–‌స్వరాలు స్థిరపడ్డాయి. ఆ మార్గంలోనె గోర్ నాయిక్ కలం పేరు గల శ్రీ రాథోడ్ శ్రావణ్ రూపొందించిన ఈ “ముత్యాల హారాలు “అనే నూతన కవిత ప్రక్రియ కుడా ఇటివలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.తెలుగు సాహితీ సాగర గమనంలో ఎందరో సాహితీ వేత్తలను కదిలించిన సాహితీ సృజనాత్మక అలల సంగ్రామంలో ఆవిర్భావించిన నూతన కవిత ప్రక్రియ, ముత్యాల హారాలు అత్యల్ప కాలంలోనే అత్యధిక జనబాహుళ్యంలో కీర్తి ప్రతిష్టలు పొంది, రమణియంగా , సామాజిక స్పృహతో విభిన్న ముత్యాలహారాలు అల్లుకుంటుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడైన రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ సాహితీ వేదికకు గతంలో అధ్యక్షులుగా సేవాలు అందించిన అనుభవం ఉంది.శ్రావణ్ మదిలో మొలకెత్తిన అంకురమే ఈ “ముత్యాల హారాలు” ఇవి అతితక్కువ కాలంలో చాలా మంది సాహితీ పెద్దల ప్రశంసలను అందుకొని సాహితీ వేత్తలచేత గుర్తింపును పొంది, అనతికాలంలోనే ఊహించని విధంగా వ్యాపించింది. మాత్రా ఛందస్సు, పాదాలు, అంత్యానుప్రాస,నాలుగు పాదాలతో భావాత్మకంగా పద్యరూపంలో మిగితా ప్రక్రియల కంటే ఇదే‌ సమంజసంగా ఉందని ప్రముఖ కవయిత్రి అద్దంకి లక్ష్మి
ముంబై గారు, ప్రముఖ కవి నేరేళ్ళ రంగాచార్య ఆదిలాబాద్ గారు, ప్రసిద్ధ కవి రచయిత, తెలంగాణ రాష్ట్ర రచయితల సంఘం ఉపాధ్యాక్షులు, ఉట్నూర్ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ,శ్రీ ,గోపగాని రవీందర్ లక్షటిపేటా మంచిర్యాల జిల్లా గారు కొనియాడారు, కవులు, నాగేశ్వరరావు కర్నూల్ గురుమూర్తి కడప, అబ్దుల్ హాకిమ్ గుంటూరు,మేకల విజయలక్ష్మి గోదావరిఖని బంకట్ లాల్, ఆత్రం మోతిరామ్, ఉట్నూర్ సాహితీ వేదిక కవులు ఉమ్మడి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాహితీ వేత్తలు కితాబిచ్చారు.మంచి స్పందనతో ముందుకు కొనసాగుతున్న ముత్యాల హారాలు పద్యరూపంలో ఉండడం వలన పాఠకులు హక్కున చేర్చుకున్నారు. వాజయవాడకు చెందిన ప్రముఖ ఆధునాతన కవి వాగ్దేవి కళాపీఠం విజయవాడ కవనవేదిక చైర్మన్ డాక్టర్ గానుగుల యుగంధరాచార్య సతిమణి పూజితాచార్య గారు శతాధిక పద్యాలు రాసి సాహితీ ముత్యాలహార పురస్కారం పోందడం గమనార్హం.అత్యల్ప వ్వవధ్ధిలోనె రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ ప్రక్రియలో సాహితీ ముత్యాలహార పురస్కారం పొందడం విశేషం. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ములకారణమైన భారతియుల రంగుల పండుగ హోలీ సందర్భంగా నా మొదటి ముత్యాల హారం ..

రంగుల రంగోలి హోలి
రంగుల హరివిల్లు హోలి
కన్నుల పండుగ హోలి
రంగుల పండుగ హోలి !!

ముత్యాలహారాలు:- నియమము :-

1)ఇది తెలుగు సాహిత్యంలో నూతన లఘు కవిత ప్రక్రియ, 2) ఇందులో నాలుగు పాదాలు ఉండాలి,
3) ప్రతీ పాదములో 10 నుండి 12 వరకు మాత్రలు ఉండాలి.
4) 1,2,3,4 పాదాల్లో చివర అంత్యానుప్రాస ఉండాలి.
5) నాలుగు పాదాలు కలిపి చదివినప్పుడు భావాత్మకంగా ఉండాలి.లగువు‌( I ) ను ఒక మాత్ర గురువు( U)‌ను రెండు మాత్రలుగా పరిగణిస్తారు. ప్రవిత్ర రంగుల పండుగ హోలి నాడు వాట్సాప్ సముహంలో ప్రయేగాత్మకంగా ముత్యాల హారాలు పరిచయం చేసినాను . సామాజిక మాధ్యమాల్లో ఇంతింతై ….వటుదింతై అన్నట్లుగా దిన దినన నలుదిక్కులా వ్యాపించింది. ప్రారంభమైన నెల రోజులలోనే పది మంది కవులకు ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఈ సాహితీ ముత్యాలహార పురస్కారం- 2021 ప్రధానం చెయడం జరిగినది . ‌ హిందీ భాషాల మిద పట్టు ఉండడంతో హిందీ భాషల్లో కుడా అనువదించడానికి ఆసక్తి చూపుతున్నాను. ఇది అదిలాబాద్ జిల్లా సాహితీ రంగంలో మొదటి ప్రక్రియ అని సాహితీ పరుల అభిప్రాయం. ముత్యం హారం రూపకర్త అను నా పైన ప్రముఖ కవి హుజురాబాద్ మండలం కరీంనగర్ జిల్లా చెందిన శ్రీ కల్వల రాజశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా రాయడం జరిగింది.

ముత్యాల హారమును
శ్రావణుడు సృష్టించెను
కవులందిరి కలాలను
కదుపుటకు పూనుకునెను

ప్రత్యేక నియమాలతో ఏర్పడి సారస్వత లోకంలో ప్రభంజనం సృష్టిస్తోంది. “ముత్యాల హారాలు ” రాబోయే కాలంలో తెలుగు సాహిత్యంలో ఒక నూతన ఒరవడితో కవులకు రచయితలకు,పాఠకులకు అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహములేదు. ఈ ప్రక్రియను చరవాణి ద్వారా పరిచయం చేసి పదిమంది కవులతో అక్షర సేద్యం చేయిస్తు కనుమరుగు అవుతున్నా తెలుగు భాషాను రక్షించేందుకు మీ కృషి అభినందనీయమని సాహితీవేత్తలు, భాషాభిమాన ఉట్నూర్ సాహితీ వేదిక కవులు తెలియజేశారు.

*వ్యాసకర్త.*
*రాథోడ్ శ్రావణ్*
*ముత్యాలహారం రూపకర్త.*
*పూర్వ అధ్యక్షులు, ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా* 9491467715

Get real time updates directly on you device, subscribe now.