ముత్యాలహారం ప్రక్రియలో తొలి పుస్తకావిష్కరణ

ISBN

*ముత్యాలహారం ప్రక్రియలో తొలి పుస్తకావిష్కరణ:-*

*హరిత హారానికి ముత్యాల హారం పుస్తకం*

ఉట్నూరు:- ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు కేంద్రంలోని ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ముత్యాల హారం రూపకర్త ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్ రూపొందించిన తెలుగు సాహిత్యంలో లఘు కవితా ప్రక్రియ ముత్యాల హారంలో తొలి పుస్తకం హరిత హారానికి-ముత్యాల హారం అనే పుస్తకాన్ని ఆదిలాబాదు జిల్లా పరిషత్త్ చైర్మన్ గౌ, శ్రీ, రాథోడ్ జనార్ధన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉసావే పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్ మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా చేట్లు నాటే కార్యక్రమం పై విద్యార్థులకు, పాఠకులకు,కవులకు రచయితలకు అవగాహన కోసం హరిత హారంకు అక్షరాలతో అంజలి ఘటించారు. అడవిని రక్షించి దాని వలన కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం డెభై కవులు, రచయితలచే ఈ పుస్తకం ముద్రణ చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు సాహితీ వేదిక అధ్యక్షులు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ప్రధాన కార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్, ప్రచార కార్యదర్శి ఆత్రం మోతిరామ్, ఉట్నూరు సాహితీ వేదిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కవులు రచయితలు పుస్తకంలోని కవితలు అరణ్యాలు అంతరించడం వాతావరణం కలుషితం కావడం మానవులువల్లెనని అందరూ చేట్లను విరివిగా నాటి స్వేచ్ఛ మైన గాలిని మానవులకు అందించాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు ఇఇ రాథోడ్ భీంరావు, బి ఎడ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. మెస్రం మనోహర్, జీవవైవిధ్య కమిటీ సభ్యులు మర్సకోల తిరుపతి ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు కట్ట లక్ష్మణాచారి, పూర్వ అధ్యక్షులు కొండగుర్ల లక్ష్మయ్య, కోశాధికారి డాక్టర్. ఇందల్ సింగ్ జాదవ్, కవులు సాకి ప్రశాంత, మురళి జాదవ్, దెగావత్ ధరంసింగ్, గురుభక్త కవి తొడసం నాగోరావు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు అనిల్ రాథోడ్, చౌహాన్ పరమేశ్వర్,ముకుంద్ రావు, కుమ్రా లాల్ షావు, మంగం విషం రావు, ఉట్నూరు అటవీ క్షేత్ర అధికారులు శ్రీనివాస్, భీమయ్య తదితరులు హాజరయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.