స్వీపర్ ల గోడు పట్టదా?

ఇంకా ఎన్నాళ్ళు

తెలంగాణ ప్రభుత్వ స్కూల్ స్వీపర్ల సమస్యల పరిష్కారానికై జూలై 03, 2023 – 7 వ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో రిలే నిరాహార దీక్షలు తెలంగాణ ప్రభుత్వ స్కూల్ స్వీపర్ల సంఘం నిర్మల్ జిల్లా.

తెలంగాణ రాష్ట్ర స్వేవర్ల సంఘము – నిర్మల్ జిల్లా.

డిమాండ్స్ :-

గత 30,40 సంవత్సరాల నుండి పనిచేస్తున్న జిల్లా, మండల పరిషత్ స్కూల్ స్వీపర్లను రెగ్యులర్ చేయాలి. కనీస వేతనం మంజూరు చేయాలి. బేషరతుగా అందర్నీ రెగ్యులర్ చేయాలి.

సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.

అర్హతను బట్టి స్వీపర్లందర్ని ప్రమోషన్స్ ఇచ్చి పాఠశాలలో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టుల్లో భర్తీ చేయాలి. శ్రీ ఏవీయస్ రెడ్డి హైపవర్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలి.

పి.ఆర్.సి 30% జి.వో. యం.యస్ 64, 15-06-2021 నుండి ఏరియాస్ నేలకు 1200/- చొప్పున ఇవ్వాలి

61 సంవత్సరం నుండి రిటైర్డ్ అయిన స్వీరప్లలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించి పెన్షన్ రూ. 10,500/- ఇవ్వాలి.

చనిపోయిన స్వీపర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

ఆంధ్రప్రదేష్ లో స్కూల్ స్వీపర్లకు టైమ్ స్కేల్ రూ.19 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి.

రిటైర్మెంట్ అయిన స్వీపర్లకు జి.వో. 45 ప్రకారం రూ. 15,00,000 లు ఇవ్వాలి అని రోడ్డు కెక్కారు స్వీపర్ లు

Get real time updates directly on you device, subscribe now.