ఆదిలాబాద్ : గెస్టు ప్యాకల్టీ నియామకాల్లో అవకతవకలు

అతిథి నియామకాల్లో అవినీతి రాజ్యం ఏలుతుంది

ఆదిలాబాద్ న్యూస్ : 10. 09.2024

ఈరోజు వెలువడిన ఆదిలాబాద్అతిథి అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందింది. పీహెచ్డీ సబ్మిట్ చేసిన వాళ్లకు కాకుండా నెట్ వాళ్ళుకు అప్పనంగా అప్పగించారు. అందుకే ప్రిన్సిపాల్ పై సీసీ తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలి అని అభ్యర్థులు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ పాత వారినే తీసుకుంటే నోటిఫికేషన్ అవసరం లేదు. అయినా త్రిమెన్ కమిటీ కూడా తోత్తు గా మారిందని నిరుద్యోగులు తమ బాధను వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ సైన్స్, ఆర్ట్స్, మహిళా కళాశాలల్లో అవకతవకలు జరిగాయి అని తెలుస్తుంది.

సీసీ నుండి కచ్చితంగా ఉత్తరువులు లేని కారణంగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. యూజీసీ రూల్స్ రాష్ట్రములోఏ డిగ్రీ కళాశాల అనుసరించి నడవడం లేదు అనడానికి తార్కణం ఇదే. రేవంత్ రెడ్డి విద్యా పాలనాలో విఫలం అయినట్లు తెలుస్తుంది. ఆయా జిల్లాలో విద్యా వ్యవస్థ కుంటు పడింది. రాష్ట్రము లో సీసీ లో అయితే జేడీ ల వల్ల నష్టం జరుగుతుంది. జిల్లాల్లో ప్రిన్సిపాల్ మరియు త్రిమెన్ కమిటీ వల్ల నష్టం జరుగుతున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం అనుమానాలకు తావిస్తుంది.

రాష్ట్రములో ఇలా వుంది

అసలు ఈ గెస్టు వ్యవస్థనే సరిగా లేదని మార్పులు చేయుమని కాంట్రాక్టు వ్యవస్థ లో విలీనం చేయాలని ఎన్ని సార్లు సీసీ ని కలిసిన లాభం లేదని అతిథి అధ్యాపకులు వాపోతున్నారు. కనీసం కన్సల్దేటెడ్ అయినా ఇస్తే బాగుండేది. 72 పిరియడ్లు వస్తేనే తత్సంబందించిన కూలి వస్తది. యూజీసీ ప్రకారం ఒక పిరియడ్కు 1500 ఇవ్వాలి కాని కేవలం 390 మాత్రమే చెల్లిస్తుంది. ఇది పెరుగక పోవడానికి జేడీలు కారణం అని అధ్యాపకులు బాధను సమదర్శిని న్యూస్ తో పంచుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.