తెలుగు అకాడమీ రచయితగా డాక్టర్ జాడె భీమారావు

రచన లో భాగస్వామ్యం

నిర్మల్ న్యూస్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో సహాయాచార్యులు మరియు ప్రధానాచార్యులు గా పనిచేస్తున్న లెఫ్ట్నెంట్ డాక్టర్ జాడె భీంరావు గారు ప్రభుత్వ పాలనాశాస్త్ర విభాగాధిపతిగా సమర్థవంతమైన బోధన చేస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారు. నిర్మల్ ప్రభుత్వ డీగ్రీ కళాశాలకు
వన్నె తెస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు తర్వాత తెలుగు అకాడమీ డీగ్రీ విద్యార్థుల కోసం నూతన పాఠ్య గ్రంథాలను భాష, శాస్త్రాలలో రూపొందించింది. విద్యార్థులకు కొత్త జ్ఞానాన్ని అందించేందుకు నడుం బిగించింది. సమాజపు కొత్త పోకడలను పాఠ్యంశాలుగా అందించనుంది.

కొత్త పాఠ్య గ్రంథాల పఠనం వల్ల విద్యార్థులలో అనేక నైపుణ్యాలను మెరుగు పరుచునుంది అదే క్రమంలో ద్వితీయ స్నాతక విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలనా శాస్త్ర పాఠ్య గ్రంథ రూపకల్పనకు అంకురార్పణ చేసింది. ఆ జ్ఞాన యజ్ఞంలో డాక్టర్ జాడె భీంరావు గారు పాఠ్యంశాలను అందించి రచయితగా తెలుగు అకాడమీ లో సుస్థిరమైన స్థానాన్ని పొందారు.

నేడు 11.09.2023న ప్రిన్సిపాల్ గారు ఈ పాఠ్య గ్రంథాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ గారిని సన్మానించారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ అతిక్ బేగం, రఘు, AO నాగ శ్రీనివాస్ ;సహాయాచార్యులు రమా కాంత్, పీజీ రెడ్డి, డాక్టర్ అజయ్, డాక్టర్ అరుణ్, సరితా రాణి, రవి కుమార్, డాక్టర్ శంకర్, టి నర్సయ్య, డాక్టర్ రజిత, శ్రీహరి, ఉమేష్, పవన్ కుమార్,అతిథి అధ్యాపకులు దిలీప్,మురళీధర్,డాక్టర్ రంజిత్, నరేందర్, రవీందర్, వెంకట్ రెడ్డి,సహిస్తా గుల్నాజ్, , మున్నవర్, అఫ్రీన్, కళాశాల సిబ్బంది పెంటన్న,స్వామి, జగదీశ్,సత్యం, ఇర్ఫాన్, రజిత, దీవెన, లక్మి, లక్ష్మమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు .


వ్యాస కర్త
డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
తెలుగు అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్
9849808757

Get real time updates directly on you device, subscribe now.