గెస్టులకు సువర్ణ అవకాశం

ISBN NEWS

డిచ్‌పల్లి సమదర్శిని న్యూస్ : న‌వంబ‌ర్ 5న‌ ఇచ్చిన ఒక ప్రకటనలో
జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌, డిచ్‌పల్లి, బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పలు సబ్జెక్టుల్లో బోధించేందుకు అర్హులైన అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.
గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్‌ సబ్జెక్టుకు, డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జువాలజీ, తెలుగు, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కామర్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్‌ సబ్జెక్టు బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు . తదుపరి డెమోలు ఉంటాయి

పీజీలో సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ లకు 50 శాతం) కలిగి ఉంటే సరిపోతుంది . నెట్‌, సెట్‌, పీహెచ్‌డీ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది . బోధనానుభవం కలిగిన అభ్యర్థులు సర్వీస్‌ సర్టిఫికెట్‌ జత చేయాలి . అర్హులైన అభ్యర్థులకు ఈనెల 8న గిరిరాజ్‌ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి డెమో, ఇంటర్వ్యూలు ఉంటాయి . అభ్యర్థులు తమ దరఖాస్తులను గిరిరాజ్‌ కళాశాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని ప్రిన్సిపాల్ తెలిపారు .

Get real time updates directly on you device, subscribe now.