నమూన పర్యావరణ జిల్లా పరిషత్ నిర్వహణ
సమదర్శిని న్యూస్ : నర్సింహులపేట.
ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరైన ,మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ,వచ్చే ప్రజలలో పర్యావరణ పరిరక్షణ స్పృహను కల్పించడానికి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ విద్య విభాగం, మరియు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థుల మోడల్ జిల్లా పరిషత్ ,ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ సమావేశాన్ని ,నర్సింహులపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో , 8,9 తరగతుల విద్యార్థులను, 4 బృందాలుగా ,అధికార పక్షం, ప్రతిపక్షం , జిల్లా అధికారులు, పత్రిక విలేకరులుగా, ఎన్నుకొని పర్యావరణ పరిరక్షణ , కొరకు జాతరకు వచ్చే ,ప్రజలలో అవగాహన కల్పించే విధంగా మోడల్ పర్యావరణ జిల్లా పరిషత్, నిర్వహించడం జరిగిందని ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,బి రామ్మోహన్ రావు గారు, తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో, పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు M. యాకన్న ,లాల్ చంద్, ఉపాధ్యాయలు ,వెంకటరెడ్డి, రవీందర్, రమాదేవి, రాజు , డానియల్ శేఖర్ ,వరకుమార్, లింగయ్య, పద్మావతి, మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది.