అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేయాలి

*అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేయాలి*

సమదర్శిని నిర్మల్ న్యూస్ :నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలోని దివ్య నగర్ లో గల హరిహర క్షేత్రం అయ్యప్ప టెంపుల్ ముందర భాగంలో గల 534సర్వేనెంబర్ గల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమణకు గురి చేస్తున్నారని అట్టి భూమిని కబ్జా కోరల నుండి కాపాడి ఆ ప్రభుత్వ భూమిలో జిల్లాలోని నిరుద్యోగులందరికీ ఉపయోగపడే విధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా పక్షాన ఈరోజు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంతం గణేష్, కత్తి నవీన్, దామ భూమేష్, దేవి రవి, అరుణ్, సప్పల రవి, సేపూరి సిద్ధార్థ, మణికంఠ, నిమ్మ గణేష్, బి రాజు, తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.