*హృదయ భారతి….. దివ్యాంగులకు ఆర్థిక చేయూత*
హృదయ భారతి సేవాసంస్థ …
స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ అందవిద్యార్థుల సహాయార్థం
ఆగస్టు 12 వ తేదీన
రామాంతపూర్ లో గల బాలభారతి పాఠశాల విద్యార్థులచే సహాయ నిధికి విరాళాలు సేకరించి దివ్యాంగులైన
అందవిద్యార్థుల కు అందించడం జరిగింది…
మానవసేవే మాధవసేవ మరియు పిల్లల్లో సేవాతత్పరత పెంపొందించుట ప్రధాన లక్ష్యంగా పాఠశాల లోని విద్యార్థులచే విరాళాలు సేకరింపచేసి ఆ మొత్తాన్ని స్పూర్తిజ్యోతి ఫౌండేషన్ వారి కి ఆర్థిక సాయాన్ని అందించాము అని *హృదయ భారతి చైర్పర్సన్* *డా.మంగళ మక్కపాటి చెప్పారు*
పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కపర్దీశ్వరుడు మాట్లాడుతూ హృదయభారతి సేవా సంస్థ వారు చేపట్టే ఎన్నో కార్యక్రమాలలో మా విద్యార్థులను భాగస్వామ్యం చేసి మాకు అవకాశం ఇవ్వడం మా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతుంది అలాగే మానసికోల్లాసానికి సాయం చేసే గుణం ఎంతో ఆవశ్యకం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన *ఆచార్య రమేష్ గురూజీ* యోగా గురువు గారు మాట్లాడుతూ విద్య తో పాటు సమాజం లో సాటి వ్యక్తి కి సహాయపడటం మానవ జన్మకు సార్థకత చేకూరుస్తుంది అంటూ యోగా మరియు సేవాతత్పరత ల వల్లే సంస్కారం వికసిస్తుంది.అలాగే ఇటువంటి కార్యక్రమాలు నగరం లోని పలు పాఠశాలలో నిర్వహించి అందరినీ భాగస్వామ్యం చేయాలి అని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అని తెలిపారు హృదయభారతి ఛైర్పర్సన్ శ్రీమతి డా.మంగళ మక్కపాటి గారు మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ సేవా యజ్ఞంలో భావిభారత పౌరులను భాగస్వామ్యం చేయటం వారిలో సేవా భావాన్ని నింపడం హృదయభారతి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి . విరాళాలు సేకరించి విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తో పాటు గా ఎక్కువ సేకరించిన వారికి మెమెంటోలు విచ్చేసిన అతిథుల చేతులమీదుగా అందచేయటం జరిగింది మరియు అతిథులకు మరియు సహకరించిన పాఠశాల యాజమాన్యంకు ప్రత్యేక సన్మానం చేసి స్ఫూర్తిజ్యోతి ఫౌండేషన్ వారికి ఆర్థిక సాయాన్ని అందరిచే అందింపచేసి ఆ దివ్యాంగ అంద విద్యార్థులు పాటలు పాడి విద్యార్థులలో స్ఫూర్తిని నింపే కార్యక్రమం చేయడం ఆనందకరం అని అన్నారు .
ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి టి.నాగమణి, అధ్యాపకబృందం, సుదర్శన్
గౌడ్,వందన,విద్యార్థినీ విద్యార్థులు,హృదయభారతి సిబ్బంది స్పూర్థిజ్యోతి ఫౌండేషన్ దివ్యాంగ కళాకారులు పాల్గొన్నారు
….హృదయ భారతి సేవా సంస్థ
స్వర్ణపుష్పం మాసపత్రిక
రామంతపూర్, హైదరాబాద్.