మన చరిత్ర
*నాగులు ఒక పరిచయం☸️*
*✍️అరియ నాగసేన బోధి*
*నాగారాధన : సంతానం లేని వాళ్ళు పాముల పుట్టవద్దకు వెళ్ళి పూజలు చేస్తారు.సంతానం లేదని భార్యాభర్తలు నాగారాధన చేయడం నాగజాతి సాంప్రదాయం అని చెప్పవచ్చును. మా తల్లిదండ్రులకు చాలా సంవత్సరాలు పాటు పిల్లలు లేరు. పిల్లలు కలగాలని పుట్టపూజ చేస్తుననప్పుడు పుట్టలో పాలు పోస్తుండగా నాగపాము పుట్టలో నుండి బయటకు వచ్చింది అని ఆ నాగపాము ఆశీస్సులు వలనే నేను పుట్టానని అందుకే నాకు నాగు ,నాగేంద్ర అని పేరు పెట్టినట్లు మా అమ్మనాన్నలు తరచూ నాతో మా కుటుంబ సభ్యులతో చెప్పేవారు. చిన్నవయసులోనే ఈ విషయం నా చెవిన పడినా నేను పెద్దగా దీని గురించి ఆలోచన చేయలేదు. ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపాడేసే వాణ్ణి.భారతీయులు నాగజాతి వాళ్ళు ఈ దేశ భూమిపుత్రులు, మూలవాసులు.ఆర్యులు ఈ మూలవాసుల చరిత్రను చాలా అన్యాయంగా.దురహంకారంతో, కుట్రతో ధ్వంసం చేసారు.మన భారతీయులలోనూ నాగజాతి వాసనలు మూలాలు ఉన్నాయి.*
*1758 వ సంవత్సరంలో కార్ల్ లినియస్ అనే సైంటిస్ట్ తొలిసారిగా ‘నాగు’ అనే సంస్కృత భాషలోని పదాన్ని లాటిన్ భాషలో ‘నాజ’ అని పరిచయం చేసెను.*
*☘️ప్రపంచ వ్యాప్తంగా నాగులు ఉన్నారు.నాగరికత గల వాళ్ళు నాగులు. వీళ్ళు అత్యంత శక్తివంతమైన వాళ్ళు.*
*నాగజాతికి ఆద్యుడు శిశునాగుడు : చరిత్రకారుడు, ప్రపంచ మేధావి, మానవీయ శాస్త్రజ్ఞుడు అంబేడ్కర్ నాగజాతి గురించి ఈ విధంగా పేర్కొన్నారు….”భారతీయ చరిత్ర లో అత్యంత శక్తివంతులు నాగులు.నాగులను జయించలేని ఆర్యులు నాగులతో సఖ్యత పాటించి ,వారితో శాంతిని కోరారు. ఆర్యేతరులైన ఈ నాగుల కాలం ప్రపంచ చరిత్రలోనే ప్రతిభావంతమైన ,సుఖ-శాంతుల కాలంగా చెప్పబడింది. ఈ నాగులకు ఆద్యుడు శిశునాగుడు.క్రీ.పూ.642 లో బీహార్ లోని మగధలో ఈ రాజ్యం స్థాపించబడింది.ఈ నాగ వంశంలో ఐదవ రాజుగా ,బింబిసారుడు ,మగధ రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా మలిచాడు.మగధ సామ్రాజ్యం (బి.సి.413) క్రీ.పూ.వరకూ కొనసాగింది.శిశునాగ వంశ చక్రవర్తి మహానందున్ని ,నందుడనే ఔత్సాహికుడు చంపి ,నందరాజ్యాన్ని స్థాపించాడు. ఇది క్రీ.పూ.322 వరకూ కొనసాగింది. నందరాజ్యాన్ని శిశు నాగవంశానికే చెందిన చంద్రగుప్త మౌర్యుడు కూలదోసి ,మరలా నాగవంశ రాజ్యాన్ని పునరుద్ధరించాడు.”*
*శిశునాగుడు అవంతి మరియు వత్స రాజ్యాలను జయించెను. ఇతని ఆధ్వర్యంలో రెండో బౌద్ధ సంగీతి కూడా నిర్వహించడం జరిగింది.*
*ప్రపంచంలో నాగులు చాలా శక్తి వంతులైన రాజులు.నాగులు నల్ల జాతీయులు.ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈజిప్టు, మెసపటోమియా,సింధూ నాగరికతలను మరికొన్ని ప్రపంచంలో పేరెన్నికగన్న నాగరికతలు నాగజాతి చక్రవర్తులు,నాగజాతి ప్రజలు నిర్మించారు.*
*మన భారతదేశంలో సింధూ నది నాగరికతకు నాగులు మూలపురుషులు.ఈ నాగులు ఆదిమ తెగకు చెందిన వాళ్ళు.ఆనాడు మన భారతదేశ ఉపఖండాన్ని “నాగదీప”,”నాగమండల”,”నాగభూమి”,”చెరనాడు”,”చెరమండల”,”జంబుదీప”,”పాతాల” అనే పేర్లతో పిలుచుకునే వారు.నాగులకు స్వంతంగా రాజ్యాలు ఉండేవి.నాగజాతి రాజులలో అసురులు, రాక్షసులు(రక్షకులు),పిశాచులు, నిషాదులు, భూతాలు, దానవులు, దైత్యులు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఆనాడు ఈ రాజులు పాలించిన రాజ్యాన్ని “నాగమండలం(భారతదేశం)” అని పిలిచే వారు.*
*మెసపటోమియాలో లభించిన ఒక పాత్ర మీద విచిత్ర జంతువులను బంధించిన రెండు నాగులు ఉన్న చిత్రం ఉంది.అలాగే సుమేరియాలో లభించిన ఒక ఫలకంపై కూడా నాగులు ఉన్న చిత్రం ఉంది.*
*❄️నాగసాకి : జపాన్ దేశంలో ఉన్న ఈ నాగసాకి నగరంపై రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబు ప్రయోగించబడింది.*
*☘️గంగానది కుంభమేళాలో కూడా నాగాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.*
*భారతదేశంలో నాగాలాండ్ పేరుతో ఒక రాష్ట్రం కూడా ఉంది.మహారాష్ట్రలో నాగపూర్ పేరుతో నగరం కూడా ఉంది. ఇది భారతీయ నాగరాజులకు ఒకప్పుడు కేంద్రంగా ఉండేది. ఈ నాగపూర్ కు.దగ్గర లో నాగానది కూడా ప్రవహించేది.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ నాగపూర్ లోనే లక్షలాది మందితో బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించెను.*
*ప్రారంభంలో బుద్ధ భగవానుని మత ప్రచారానికి సారధ్యం వహించింది నాగులు. నాగులు ఆర్యేతరులు. ఆర్యులకు ఆర్యేతరులైన నాగులకు బద్ధవైరముండేది. నాగులకు ఆర్యులకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆర్యులు నాగులను పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నించారు. ఆర్యులు నాగులను సజీవదహనం చేసేవారు. పురాణ వాంజ్మయంలోనూ ఈ సంఘటనలు వివరించబడ్డాయి. అగస్త్య మహర్షి ఒక నాగుని సంరక్షించాడు. మనము ఆ మహా నాగుని వారసులము.*
*అంబేడ్కర్ నాగపూర్ లో ధమ్మ దీక్ష సందర్భంగా ప్రసంగిస్తూ ఇలా చెప్పారు..”ఆర్యులు నాగులను అణచివేసి హింసించేవారు. వారి విముక్తికి ఒక మహాపురుషునికై నిరీక్షిస్తున్న సమయంలో, బుద్ధ భగవానుడు ఆవిర్భవించాడు. ఆయన నాగులను ఆర్యుల హింస నుండి విముక్తులను చేశాడు. నాగులు బౌద్ధ మతాన్ని ప్రపంచ నలుమూలలు వ్యాపింపచేశారు. నాగపూర్ మీదుగా నాగ అనే నది ప్రవహించేది. దాని ఒడ్డున నాగులు నివాసముండేవారు. నాగులు నివాసస్థలం కావున దానికి నాగపూర్ అనే పేరు వచ్చినది. అంత చారిత్రక ప్రశస్తి ఉన్న కారణంగానే నాగపూర్ కేంద్రంగా నిర్ణయించి ధర్మ ధీక్ష స్వీకరించడమైనది.”*
*కుచెర్ర నాగ : నాగవంశానికి చెందిన ఈమె రెండో చంద్రగుప్తుని భార్య.రెండో చంద్రగుప్తుని కాలం క్రీ.పూ 38౦-414.*
*నాగమాంబ : శ్రీ కృష్ణ దేవరాయలు తల్లి పేరు నాగమాంబ.ఈమె తిరుపతి దగ్గర లో గల నాగులాపురం లో జన్మించారు.*
*☸️నాగసేనుడు : నాగసేనుడు బౌద్ధ మహాపండితుడు,తత్త్వవేత్త ,భిక్షువు.క్రీ.పూ.165-145 కాలానికి చెందిన గ్రీకు రాజు మినాండర్ (మిలిందుడు) ను తన పాండిత్యం ద్వారా బుద్ధ ధమ్మాన్ని బోధించి రాజుకు బౌద్ధం గురించి అవగాహన కలిగించెను.రాజుకు బౌద్ధ ధమ్మాన్ని కూడా ఇచ్చెను.వీరి ఇరువురు మధ్య జరిగిన సంభాషణలు మిలింద ప్రశ్నలు పేరుతో గ్రంథం వెలువడింది.*
*నాగసేనుడు ఒక బౌద్ధ భిక్ఖువు .మిళిందుడు అనే రాజును తాత్విక విషయాలు పైన బౌద్ధ ధమ్మానికి సంబంధించిన అనేక అంశాల పట్ల ఇద్దరికీ సంవాదం జరుగుతాది .నాగసేనుడు అతనిని ఓడిస్తాడు .నాగసేనుడు ,మిళింద్ లూ చారిత్రక పురుషులు.*
*మౌర్య సామ్రాజ్య పతనం ప్రారంభం కాగానే అశోకుని మరణం క్రీ .పూ .227 తరువాత భారత ఉపఖండం వాయువ్య భాగాలు గ్రీకు రాజుల ఏలుబడిలోకి చేరిపోయాయి .ఆ రాజుల్లో ఒకడు ఈ మినిందర్ .ఈ మినిందర్ రాజ్యం ఇప్పటి పంజాబ్ ,అప్ ప్రాంతాలుగా మౌర్య సామ్రాజ్య పతనం ప్రారంభం కాగానే అశోకుని మరణం క్రీ .పూ .227 తరువాత భారత ఉపఖండం వాయువ్య భాగాలు గ్రీకు రాజుల ఏలుబడిలోకి చేరిపోయాయి .ఆ రాజుల్లో ఒకడు ఈ మినిందర్ .ఈ మినిందర్ రాజ్యం ఇప్పటి పంజాబ్ ,ఆప్ఘనిస్తాను ప్రాంతాలుగా చారిత్రకులు నిర్ణయించారు.మినిందరే మిలిందుడు ..నాగ సేనుడు పండితుడు ..పేరును బట్టి నాగసేనుడు ఆంధ్ర దేశీయుడే అని ఊహ.సోణత్తరుని కుమారుడే నాగసేనుడు.ఇరవై ఏళ్ల ప్రాయం లోనే శతకోటి అర్హతులు నాగసేనున్ని ప్రశంసించి భిక్ఖువుగా చేసారు.నాగసేనుని ఉపాధ్యాయుడు రోహిణుడు , అశ్వగుప్తుడు…ఆ తర్వాత నాగ సేనుడు అశోకరామం లో ధర్మ రక్ఖిత వద్ద కూడా ధమ్మాన్ని ఆచరించాడు.*
*భవతు సబ్బ మంగలమ్*