సస్యశ్రీ..కవయిత్రి కవితలు

ఖమ్మం

ఓ… వని తా…

కదలిరండి వనితలారా
కర్కశకామాంధుల
చీల్చి చీల్చి చెండాడగా
శివమెత్తిన శివంగులై
తరలి రండి తల్లులారా
ఝాన్సీ రుద్రమ వారసులై
ఓరుగల్లు కోటపై పోటెత్తి
కదలిరండి కదలిరండి
ఆలయాపన చేసే చట్టం
కళ్ళకు గంతలు కట్టుకున్న ధర్మం
తన చుట్టూ తిప్పుతుంటే
మనకు జరగదులే న్యాయం
నీ చుట్టే ఉందిలే ప్రపంచం
మీరేలే మీలోనే చైతన్యం
మెరుపులై ఉరుములై
పిడుగులై అగ్ని మంటలై
లేండి లేండి రండి రండి
తనువంతా త్యాగమూర్తులారా
దూసుకు రండి లావా పొంగులై
నైజాం హింసలు నలిగినాము మనం
స్వాతంత్రంవచ్చిందనిమురిసినాము వనితలం
అర్ధరాత్రి పారిపోయిన తెల్ల దొంగవాడు
పట్టపగలే బరితెగించిన బద్మాష్ భారతీయుడు
ఇంకెంతకాలం ఎందుకు మన సహనం
ఇంకెన్నాళ్లు యంత్రాలై నలుగుదాం
మదమెక్కిన క్రూర మృగాల అగ్గితో కడుగుదాం
కదలి రండి కదలి కలసి రండి వనితలారా
తరతరాల మన అనచివేత సమాధి కట్టేద్దాం
మనిషి తోలు కప్పుకున్న మానవ మృగా లు
నిలువెల్లా విషం నింపుకున్న విషనాగులు
నరరూప మానవ రాక్షసుల అవయవాలు
ఆయుధమై ముక్కలు ముక్కలు నరుకుదాం
ఎర్రబడ్డసముద్రమైవిప్లవవిధ్వంసంసృష్టించుదాం…

సస్యశ్రీ ఖమ్మం…

..ఎక్కడో దూరాన కూర్చున్న దేవుడా…

రాతి బొమ్మల్లో కొలువున్న బొమ్మవే కదరా
నువ్వే నిజమైతే నెలకు దిగిరారా శివుడా
అమాయకులను దయ చూపక శిక్షించి
దుష్టుల రక్షించే ఇదేమి తిక్కరా దేవుడా

అమ్మ అయ్యా లేనోడివి కదరా శివుడా
తల్లి గర్భగుడి సోకం నీకేమీ తెలుసురా
నీకేమీ తెలుసురా నీదేమి మాయ ఆటరా
నీ మనసు బండ బారిన శిలయే కదరా
నీ గుండె కఠిన పాషాణమే కదరా దేవుడా

సిక్కుముడు లేసి సిత్రాలు సేస్తవట కదరా
శివమెత్తి ఆడి చిత్రంగా సింధు లేస్తవట
దయ లేని శివుడా నువ్వేమి దేవుడు అంట
భక్తి పూజలు అభిషేకాలు నీకెందుకంట
నిన్నే అడుగుతున్న సమాధానం చెప్పమంట

ఒడిలోన పార్వతమ్మ తల పైన గంగమ్మ
సిగలోన చంద్రమ్మ దేహమంతా బస్వమ్మ
మెడలోన నాగమ్మ నివాసం స్మశానమమ్మ
నిలకడే లేని నీకు నీ తీరమే నీకు లేదమ్మ
నాఅక్షరమే నీనెత్తి పైన అక్షింతల జేజమ్మ…

సస్యశ్రీ ఖమ్మం…

..ప్రజల బాధలు తీరేది ఎప్పుడు…

నాడు పథకాలుఊరిస్తూమాయమాటలతో
మాయపదకాలతోప్రజల్నిమోసంచేస్తూ ప్రజల
సొమ్ముదోచుకోవటంజరిగింది ప్రజలకు విసుగొచ్చి
ఈబాధలుఇంకెన్నాళ్లుఈ మోసంలో బతకలేమని తెలిసిమార్పుతెచ్చుకోవాలనిజ్ఞానోదయంతెచ్చుకొని
బతుకులుబాగుపడతాయనిమారిమార్పు తెచ్చారు ప్రజలకుఒరిగిందిఏమీలేదుస్త్రీలకుఉచిత బస్సు ప్రయాణంతప్పఅభివృద్ధిఏమీకనిపించడంలేదు ఉద్యోగాలఊసేలేదుముద్దగొంతులోకిదిగాలంటే సామాన్యమానవుడిబతుకుఅతుచితుకులబతుకు అయింది నిత్యవసరవస్తువులజోలికిపోవాలంటే అందుకోలేనంతఎత్తునఉన్నాయిమార్కెట్కివంద రూపాయలుతీసుకునిపోతేఒక్కరకంకూరగాయ కూడా రావట్లేదుకిరాణాకొట్టుకుపోవాలంటే చమటలుపడుతున్నాయిపిల్లల్నిచదివించాలంటే కార్పొరేట్ స్కూళ్లలో కాలేజీలలో లక్షలు పోసి చదివించాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది సర్కారు బడులు సరైనసదుపాయాలు లేక అదే సర్కార్ బడులు సర్కారు హాస్పిటల్స్ సమృద్ధిగా ఉంటే సదుపాయాలు సరిగా ఉంటే ప్రజలకు ఊరట కలగదా ప్రజలకు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటూ విర్రవీగే ఈ రాజకీయ నాయకులకు ఏసీ రూములలో కులికే రాజకీయ రాబందులకు ప్రజల బాధలు అవసరం లేదు తెలుసుకుంటే కదా తెలిసేది ప్రజలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం గొప్ప గొప్ప కోతలు కోయటం తప్ప అసలు మనం ఏం చేస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉండేవి ప్రజలకు ఇబ్బందులు కలగనివి ఇస్తున్నామా లేదా అని ఆలోచించరాఎప్పుడైనా డొక్కలు ఎండుతాయని శక్తిహీనులైనఉన్నాలేకున్నాప్రజలురెక్కలుముక్కలు చేసుకుంటేనేకదాఒకముద్దదొరికేదివారిజీవితాలు బాగుపడేది మరి ఎవడబ్బ సొమ్ము తినటంలేదుగా
మాకెందుకుఈరాజకీయదరిద్రం అంటూ ప్రజలలో ఆలోచన కలుగుతుంది ఖబడ్దార్ జాగ్రత్త రాజకీయం సస్యశ్రీ ఖమ్మం…

..పాట నన్ను పిలుస్తోంది…
******”*****”******”******

పాట నన్ను పిలుస్తోంది
గుడి గంటల
ఘన ఘనలో….
కోవెల అఖండ జ్యోతి
దీపం వెలుగులో..
అనాధ చీకటి బతుకుల
చిగురాశలలో….

కొమ్మ కొమ్మకు
కోకిల సన్నాయి రాగంలో
అందమైన పల్లె సొగసుల
పరవశంలో…..
పచ్చ పచ్చని
పైరుల దాన్యరాశిలో
అనాధ ఆకలి కేకల
ఆక్రందన ఆవేదనలో
దగా పడిన అనాధ
బతుకుల జీవితాలలో
పాట నన్ను పిలుస్తోంది ఆక్రందనతో…..

స్వర్ణ పుష్ప వసంత సుగందాలలో
హృదయ రాగ
ఊగిసలాటలలో
శుభ మంగళ
నిత్య హారతులలో
లోక కళ్యాణ
పచ్చని తోరణాలలో……
పసిపాపల
బోసి నవ్వులలో…..

సాగర కలయిక సంఘమాలలో
యమునా నదీ తీరాన
రాధమ్మ ఆవేదనలో
బృందావనంలో
గోపెమ్మల రాసక్రీడలలో
పాట నన్ను పిలుస్తోంది ఎదురుచూపులతో….

గోదావరి గలగల సవ్వడిలో
కృష్ణమ్మ ఒంపు సొంపులలో
కొండ కోనల జలపాతాల
పరుగులలో….
కాకులు వాలని
కారడవిలో….
చీమలుదూరని
చిట్టడివిలో…
పాట నన్ను పిలుస్తోంది అమావాస్య
చీకటిలో…
ఎదురు పొదలో దాగివున్న
వేణు గాన నాదంలో
పాట నన్ను పిలుస్తోంది పున్నమి వెన్నెలలో…
********************
సస్యశ్రీ ఖమ్మం…

Get real time updates directly on you device, subscribe now.