స్వరం 1

లక్షణాలు, రూపకర్త వివరాలు

 

డాక్టర్ ఏ రంజిత్ కుమార్: స్వరం
1. దీనిలో 5 వరుసలు ఉంటాయి
2. మొదటి వరుస లో 10 అక్షరాలు మించరాదు
3. రెండవ వరుసలో 10 అక్షరాలు మించరాదు
4.మూడవ వరుసలో 10 అక్షరాలు మించరాదు
5. నాల్గవ వరుసలో 10 అక్షరాలు మించరాదు
6. ఐదవ వరుసలో 10 అక్షరాలు మించరాదు
7. ఒక స్వరంలో 50 అక్షరాలు మించరాదు
8. అర్థవంతమైన భావవ్యక్తీకరణ ఉండాలి
9. ప్రాసలు, అలంకారాలు, వర్ణణలు వాడవచ్చు

💐స్వరము💐
మనసులోని
భావం పురివిప్పితే
స్వరమౌతుంది
చైతన్యరథమౌతుంది
తెలుసా!!

******* **** ***** *****

డాక్టర్ ఏ రంజిత్ కుమార్: స్వరం రూపకర్త

డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఆదిలాబాద్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర సమగ్ర అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రభుత్వేతర ఉన్నత పారశాలల్లో పండితునిగా కొంతకాలం, స్నాతక ఉపన్యాసకులుగా కూడా మరి కొంతకాలం పనిచేశారు.

ఆధునిక తెలంగాణ తొలి దేశీ ఛందస్సుతో ఛందో రంజీతము అనే లాక్షణిక గ్రంథాన్ని రచించారు.
సాహిత్య ప్రక్రియలను1995 నుండి 2015 సంవత్సరం నాటికి 32 పద్య ప్రక్రియలను అలాగే 2016 నుండి 2021 వరకు 28 నూతన పద్య గద్య ప్రక్రియలను సృజించారు. వివిధ పాఠశాలల యందు 300 మంది శిస్యులు వున్నారు. వీరిలో శతకాలు, గేయాలు, సినిమా కథలు కొందరు రాసి బాల కవులుగా తీర్చిదిద్దబడ్డారు. 60 ప్రక్రియల సాహిత్య వాట్సాప్ సమూహాలను ఏర్పాటు చేశారు. ఒక పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేస్తూ, నిత్యం సాహిత్య సాగు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.