తెలంగాణలో విద్యావ్యవస్థ శూన్యం

తెలంగాణలో విద్యావ్యవస్థ శూన్యం

తెలంగాణలో విద్యావ్యవస్థ శూన్యం

మానవుడు సంఘజీవి అతడు మనిషిగా మానవత్వం తో బతుకాలననీ హితవు పలికి దానవునిగా కాకుండా సరైన రీతిలో మానవ జాతిని తీర్చిద్దేందుకు అహర్నిశలు శ్రమించే గురువులను వారి జీవితాల్లో చీకటి పొరల్ని కుమ్ముతున్నది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఎలా

చిన్న పిల్లల ఆరోగ్యం గా ఉండాలంటే పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయింది. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లో పేరుకు పోయిన వైరస్ బ్యాక్టీరియా లు ఎన్నో వున్నాయి. వీటికి తోడు ఆట స్థలాల్లో పిచ్చిపిచ్చిగా మొక్కలు పెరిగాయి. శోచ గదులు కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఉన్నా వాటి నుండి అద్భుతమైన దుర్గంధం రావడం పిల్లల్లో లేని కొత్త రోగాలను తెచ్చిపెట్టిన ప్పటికీ విద్యాధికారులు గానీ జిల్లా అధికారులు గానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు
ప్రాథమిక, మాధ్యమిక,  ఉన్నత స్థాయి పాఠశాలల యందు దీన పరిస్థితి ఏర్పడింది అయినా పట్టించుకోకుండా ఎలా ఉంటున్నారూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

పాఠశాల స్థాయిలో విద్యావాలంటర్లు

చిన్న పిల్లలకు అరకొర జీతాలకు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తుంటే కరోనా రోగమచ్చి ఉన్న జీవనోపాధి లేక కూలి పనులకు వెళ్లాల్సిన స్థితి పల్లెల్లో కనిపించింది. పట్నాల్లో ఆ కూలీకి కూడా దిక్కులేక కడుపు చేతపట్టుకొని చావు బతుకుల మధ్య కరువు కాలంలో అడ్డమైన పనులు చేయలేక మెస్ట్రీ గా వలస కార్మికునిగా మారినా సరే ఎందరో ఆకలి చావులు చచ్చినా పట్టించు కోలేదు ఎందుకు ఎవడూ అడిగేవారు లేరని

వెంటనే ఇంతకు ముందు పనిచేసిన విద్యా వాలంటర్ లను మాత్రమే మళ్ళీ బడుల్లోకి పిలిచి వేతనాలు కూడా పెంచాలి. వారికి శాశ్వతంగా జీవనోపాధిని కలిగించాలి. మళ్ళీ కొత్తగా పిలుస్తా అంటే పాత వాలెంటర్ లకు అవకాశం వయస్సు ద్వారనో మేరీటు ద్వారనో రాకపోవచ్చు. వాళ్ళ బతుకుల్లో మట్టి గొట్టకండి ఎందుకంటే కోసుల నడిచి వెళ్లి దూరంగా అడవుల్లో ఒక్కడే బడిని బతికిస్తుండు కాబట్టి ఇప్పటి కైనా ప్రభుత్వం వాలంటర్ లను పట్టించుకోవాలి. పిల్లల భవిష్యత్తు ను తీర్చిదిద్దాలి

కళాశాల స్థాయిలో అతిథి అధ్యాపకులు

ఇంతకు ముందు పనిచేసిన వారికి వయస్సు దాటిపోయి ఒకప్పుడు పాఠాలు బోధించినవాడు ఇప్పుడు దిక్కుమొక్కు లేకుండా అవమాన భారంతో ప్రాణార్పణం చేసుకున్నా పట్టించుకోని నాథుడు లేడు ఈ కళాశాల స్థాయిలో కూడా,  అతిథి దేవో భవ: అని మన పెద్దలు అంటారు. ఆ మాటకు విలువనిచ్చి అలాంటి వారు ఉంటే వాళ్ళను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం వుంది. అలాగే కొత్తగా అధ్యాపకులను ఇంటర్,  డిగ్రీ కళాశాలలో కొత్త నియామకాలు చేపట్టవలసిన అవసరం ఉంది. అలాగే చదువుకోవడం కోసం మౌలిక వసతులను ఏర్పర్చాలి. కానీ కొత్తవారిని నియమిస్తే కొత్తలు ఎక్కువ గావాలే ఎం చేద్దామని పక్కనున్న సదువుకున్న సన్యాసులను సలహా అడిగితే తాత్కాలిక అనీ అతిథి అనీ ఇంకోటని చెపుతారు. శాశ్వతంగా ఏ లోటు లేకుండా చేద్దామని ఒక్క రోజైనా అనుకున్నారా లేదు.

స్నాతక అతిథి అధ్యాపకులకు 21000 వేల జీతం అనీ ఊరిచ్చి నియామక ప్రకటన విడుదల చేశారు. తీరా అక్కడికి వెళ్తే ఒక్క పాఠానికి ఒక రోజుకు 300 ఇస్తారు. యూజీసీ 500 ఇవ్వమన్న ఇవ్వరు. సెలవులు వోను ఆ 21 కూడా రావు పేరుకుమాత్రం మేము ఇచ్చినం అని చెపుతారు.

విశ్వ విద్యాలయ స్థాయిలో అతిథి అధ్యాపకులు

రాష్ట్రంలో వివిధ రకాల విశ్వవిద్యాలయాల్లో ఏన్నో ఏళ్లుగా సహాయ అధ్యాపకులు, పరిశోధన అధ్యాపకులు, కార్యనిర్వాహక అధ్యాపకులు, అధ్యాపకులు, ఇలా ఎన్నో ఖాళీలు ఉన్న యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ వున్నా దాని మాటను ఎవడూ పట్టించుకోడు. శాశ్వత నియామకాలు ప్రభుత్వం చేపట్టకుండా కాలం గడిచిపోయి వయసుదాటి తినడానికి తిండి గింజకూ కరువు పరిస్థితులు వచ్చే అవకాశం లేకపోలేదు. వీసీలు కూడా పట్టించుకోరు. ఇకనైనా మేల్కొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత అధ్యాపకులగా నిరుద్యోగ మద్య వయస్కులను ఆదుకోవాలని ఆశిస్తున్నాము. దాదాపు 35 సంవత్సరాలు దాటినా వారే నిరుద్యోగంలో వున్నారు

కొందరి ప్రొపెసర్ల పోకడ

సామాన్య శాస్త్రాల్లో పరిశోధనలు మళ్ళీ మళ్ళీ అవే పాతవి చూసి కొత్తగా సమర్పించిన పట్టించుకోకుండా వుంటారు. కొత్తగా పేరు మారితే చాలు పరిశోధన అయిపోయినట్లే,  ఇంకొందరు రహస్యంగా శిష్యురాళ్లను వాడుకొంటారు;  సాంఘీక శాస్త్రాలలో అయితే విభాగాధిపతులు 2 సంవత్సరాలకు ఒకరు వస్తారు వారి సొంత అభిప్రాయాలు పరిశోధకులపై రుద్ది కాలయాపన చేస్తూ ఉంటారు.  అయినా ఎవరు పట్టించుకోరు ఏమన్నా అంటే అది సరిగ్గా లేదని అంటారు. ఒక పరిశోధకుడికి గైడ్ గా ఎలా ఉండాలో తెలువని వాళ్లను నియమిస్తారా అంటే కాదుమరి ఏంటి అంతర్గత రహస్యం,  మీ శిష్యులు కారు, మీ జాతి కూడా కాదు కాబట్టి అడిగేవారు వుండరు. ఇక 2 గంటలకు వస్తారు 4 గంటలకు వెళ్తారు. పరిపృచ్ఛ లలో జాతి కులం లేదా పైసలకు ఇచ్చుడు అంతేకదా నీతిగా చదువును నమ్ముకొని కొద్ది కొద్దిగా ఙ్ఞానాన్ని పెంచుకొని కోటి ఆశలతో కనీసం అతిథిగా చేద్దామన్నా అదికూడా దక్కని  సోదరులు ఎందరో హైదరాబాద్ లో హోటల్లో పని చేసుకొని బతుకుతున్నారు. అయినా చలించవు ముఖ్యమంత్రి గారు. కొంచెం మా బతుకులను బాగు చేయండి

(అందరిని ఉద్దేశించి అనడంలేదు అక్కడక్కడ జరిగిన వాటిని ప్రస్తావించారు అంతే అన్యాదా భావించ వద్దు పరిశోధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన గురువులు, శిష్యులు సంప్రదాయానుసారంగా నియమాలను పాటిస్తూ పరిశోధనలు చేసినవారు విశవిద్యాలయాలల్లో లేకపోలేదు. )

గురుకులాల్లో అతిథి అష్టకష్టాలు

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని నిర్వహించారు  వాటిలో ఒకటి కేజీ టూ పీజీ ఇది పూర్తిగా గురుకుల విద్యను 2017వ సంవత్సరం లో ప్రభుత్వం ప్రారంభించి అతిథి ఉపాధ్యాయులను నియమించుకొంది. అందులో మైనారిటీ సొసైటీ, గిరిజన సొసైటీ, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల సొసైటీ,  బీసీ వెల్పేరు సొసైటీ లను ఏర్పర్చింది. ఈ వివిధ సొసైటీల కింద తాత్కాలిక పొరుగు సేవలు మరియు అతిథి ఉపాధ్యాయులను అలాగే అధ్యాపకులను నియమించింది. వారికి ఒక్కో సొసైటీలో ఒక్కో రకమైన నియమాదేశాలు ఇచ్చింది.

అతిథిగా ఉపాధ్యాయులుగా మైనార్టీ సొసైటీలో
పొరుగు సేవలకిందా టిజిటిలకు 23000,  పిజిటీ లకు 25000, అధ్యాపకులకు 27000 చెల్లింపు చేయాలని నిర్ణయించారు. సోషల్ అండ్ బీసీ వెల్పేర్ లలో ఉపాధ్యాయులకు 14000, అధ్యాపకులకు 18000, డిగ్రీ 21000 ఇచ్చి చేతులు దులుపు కున్నాయి. ఆదర్శ పాఠశాలల్లో కూడా అతిథికి 14000 ఇచ్చారు. గిరిజన సొసైటీలో అతిథి ఉపాధ్యాయులకు 14000, అతిథి అధ్యాపకులకు18000 చెల్లించారు. ఇలా వేరువేరు జీతాల చెల్లింపులు ఎందుకు అతిథులుగా వాడుకొని ప్రభుత్వం గురువుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. సీఆర్టీలకు 40000, 50000 ఇస్తుంది.

పనిభారం అంతాకూడా అతిథులుగా వచ్చిన వీరిదే ఎంతో కష్టపడి మౌలిక వసతులు లేకపోయినా గురుకులాల్లో రాత్రి పగలు శ్రమించి తల్లిదండ్రుల వలె కంటికి రెప్పలా పురుగు బుషి నుండి కాపాడుతూ, మరో వైపు అదనపు పనిభారంతో గురుతర బాధ్యతలు స్వీకరించి విద్యార్థులకు సునాయాసంగా చదువుచెప్పినా మీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించదు మాతో వెట్టి చాకిరి చేయిస్తున్నారేందుకు అనీ అడిగేరోజు దగ్గరలోనే ఉంది.

పొరుగు సేవలు (ఔట్ సోర్సింగ్)

ఉన్నదంతా మజా ఈ వ్యవస్థలోనే ఉంది. దోచుకున్నోనికి దోచుకున్నంత మంత్రుల మనుషులు పొరుగు సేవలను అద్దెకు తీసుకుని పదింతల లాభాలు ఆర్జిస్తున్నారు. ఔట్ సోర్సింగులో ఉద్యోగాలు క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉంది. స్వీపర్,  అటెండర్, వంట మనుషులు, ప్రభుత్వ శిక్షణ సంస్థలు,  ఉపాధ్యాయులు, క్రర్క్లు అలాగే వైద్య, విద్య, విద్యుత్తు, గురుకులాల్లో, పారిశ్రామిక, పరిశ్రమలు, బ్యాంకులు, వ్యవసాయ సంబంధించిన, బొగ్గు గనుల్లో నియామకాలు, రోడ్డు రవాణ రంగం, మున్సిపాలిటీ, క్రాంతి, డ్వాక్రా, టీఎస్పీఎస్సి,  రైల్వేశాఖ, న్యాయ శాఖ, ఇంధన సంస్థలు, ఇస్రో, పరిశోధన రంగం, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, ప్రజా ప్రయోజన అద్దె పనుల్లో, మొదలైన ఇలా ప్రభుత్వ అన్నిశాఖల్లో ఈ అవినీతి పేరుకుపోయినది. ఈ విధానంలో దోపిడీ ఒక్కో శాఖ లో ఒక్కో విధంగా ఉంటుంది. 2 వేల నుండి 8 వేల వరకు ఒక్క వ్యక్తి దగ్గరి నుండే ఆయా సంస్థలు తీసుకునే మిగిలిన జీతం వస్తుంది.  కొన్ని శాఖల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది

టెండర్ విధానం వల్ల గురుకులాల్లో అవినీతి

వివిధ గురుకుల పాఠశాలలో టెండర్ విధానం లో ఆ పరిసర ప్రాంతంలో ఉన్న సర్పంచ్ రాజకీయ నాయకుల అండతో టెండర్ దక్కించుకొని అక్కడ పనిచేసే వారి జీతం లోనుండి వెయ్యి నుండి మూడు వేల వరకు బెదిరించి తీసుకుంటారు. ఇవ్వని పక్షంలో వారికి బదులుగా వేరే వారిని నియమించుకుంటారు. సొసైటీ నేరుగా జీతాన్ని వ్యక్తుల ఖాతాలో జమ చేస్తే అవినీతి పోతుంది. పండ్లు, పాలు, గుడ్లు, సరుకుల రవాణా విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది.

ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల తీరు

అన్ని విషయాలను బోధన చేసే ఉపాధ్యాయుల అందరికి సమాన వేతనం లేదు లెక్కలు, సోషల్, ఆంగ్లము చెప్పిన వారికి ఎక్కువ జీతం మిగితా వారికి తక్కువ జీతం ఇవ్వడం తెలుగు భాష బోధకులకు తీవ్రమైన అన్యాయం జరిగినా చర్యలు ప్రభుత్వం చేపట్టదు. ఫీజుల విషయంలో నియంత్రణ లోపించింది. తెలుగు భాషను ప్రైవేటు పాఠశాలలు చిన్నచూపు చూసిన నీవు స్పందించవు సారూ…

తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా విద్యా వ్యవస్థ పతనమైనా దున్నపోతుమీద ఆనపడ్డట్లు వ్యవహరించడం సరికాదు. సమగ్రమైన సర్వేలో భూములు, పెన్షన్లు పొందేవారే ఎక్కువ అందుకని విద్యా రంగంతో పని లేదని భావిస్తున్నారు కానీ నేరాలు సమాజంలో పెరగటానికి విద్యారంగానికి సంబంధం ఉందని గ్రహించండి. మరో నిరుద్యోగ ఉద్యమం రాకముందే ఉపాధ్యాయులను, అధ్యాపకులను నియమించండి. విద్యారంగాన్ని నిలపండి సారు. కేసీఆర్ గారు

ఎడిటర్
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్,

9849808757

Get real time updates directly on you device, subscribe now.