బి.సి ల ఆత్మగౌరవ భవనాలు చారిత్రాత్మకం

డాక్టర్.ఎస్.విజయ భాస్కర్ గారి వ్యాసం

బి.సి ల ఆత్మగౌరవ భవనాలు చారిత్రాత్మకం

తెలంగాణ రాష్ట్రంలో బి.సి.లకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు నిర్మాణానికి స్థలాలను కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయం.తెలంగాణ రాష్ట్రంలో 41 బి.సి. కులాలకు 82.30 ఎకరాల భూమి కేటాయించి రూ.5.500 కోట్ల విలువైన స్థలాలు కేటాయించారు.
ఆత్మగౌరవ భవనాలు నిర్మాణానికి కోకాపేట., మేడ్చల్., ఉప్పల్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాల్లో స్థలములు కేటాయించడం బి.సి.లకు మంచి అవకాశం.బి.సిలలో చాలా కులాల్లో మూడు., నాలుగు రాష్ట సంఘాలుగా నమోదు చేసుకొని ప్రతి ఒక్కరూ నేనే రాష్ట్ర అధ్యక్షుడిని అంటే నేనే రాష్ట్ర అధ్యక్షుడిని అంటూ చెలామణి అవుతూ వచ్చాయి. ప్రభుత్వం బి.సి . కులాల ఆత్మ గౌరవ భవనాలకు కేటాయించిన స్థలంలను., ఆర్థిక సహాయం ఏ వర్గానికి ఇవ్వాలో తెలియక పోవడం వలన నవంబర్ 9., 10 తేదీలలో బి.సి.కులాల రాష్ట్ర స్థాయి సమావేశాలను ఏర్పాటు చేశారు.బి.సి.సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశాలకు హాజరైన బి.సి.కులాల ప్రతినిధులు రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్., పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్., ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్., బి.సి.సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరుల ముందు హాజరై బి.సి.ఆత్మగౌరవ భవనాలకు కేటాయించిన స్థలంలను., ఆర్థిక సహాయం తమ వర్గానికి ఇవ్వాలంటే తమ వర్గానికి ఇవ్వాలని గొడవలు, ఆరోపణలు., ప్రత్యారోపణలు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు., ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు బి.సి కులాలు మూడు., నాలుగు సంఘాలుగా కాకుండా ఏక సంఘంగా ఏర్పడి రావాలని సూచించారు.బి.సి లలో చాలా కులాలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో స్వంత భవనాలు లేక గ్రామాల నుండి వచ్చే ప్రతినిధులకు., వివిధ పనుల మీద వచ్చే ప్రజలకు ఎక్కడ ఉండాలో తెలియక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. డబ్బులున్న వారు లాడ్జ్ లలో ఉంటూ తమ పనులు చేసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ ఇబ్బందులను కష్టాలను గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం భరించలేని బి.సి.కులాలకు ఆత్మ గౌరవ భవనాలకు స్థలాలు కేటాయించడం., ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం జరిగింది. బి.సి. కులాలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని కుల సంఘాల నాయకులు ట్రస్ట్ గా ఏర్పడి ప్రభుత్వం దగ్గరకు వెళ్తే బి.సి కులాలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వానికి బి.సి ఆత్మ గౌరవ భవనాలకు స్థలాలు కేటాయించడం., ఆర్థిక సహాయం చేయడం సులభం అవుతుంది. బి.సి.సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు., తెలంగాణ బి.సి.శాఖ ముఖ్యకార్యదర్శి సూచనలు సలహాలు పాటించి అనేక కులాల ప్రతినిధులు ఏక సంఘంగా ఏర్పడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటిక. యాదవ. ముదిరాజ్. పూసల. నాయిబ్రాహ్మణ.విశ్వ బ్రాహ్మణ., పద్మశాలి.,గౌడ ఈ విధంగా అనేక బి.సి.కులాలు ఉన్నాయి. కుల సంఘాలన్నీ ఇంతకాలం వ్యక్తి గత ప్రయోజనాల కోసం పని చేసి కనీసం స్వంత భవనాలు నిర్మాణాలు చేసుకోలేక పోయారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని తమ తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి కుల ప్రయోజనం కోసం ఏక సంఘంగా ఏర్పడాల్సిన అవసరం., ఆవశ్యకత ఎంతైనా ఉంది.తెలంగాణ రాష్ట్రంలో అనేక కులాల ప్రతినిధులు ఏక సంఘంగా ఏర్పడ్డారు.అదేవిదంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరె కటికలు 11 గ్రూపులుగా ఉన్న వారు ఏక సంఘంగా తెలంగాణ ఆరె కటిక ట్రస్ట్ గా ఏర్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక ట్రస్ట్ ప్రతినిధులు రాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖ మంత్రిని.,బి.సి.సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి ఆరె కటిక ట్రస్ట్ అన్ని గ్రూప్ ల సమూహము అని ఆరె కటిక ట్రస్ట్ కు బి.సి.ఆత్మగౌరవ భవనం కేటాయించాలని., ఆర్థిక సహాయం చేయాలని కోరడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు నిర్మాణానికి స్థలంలను కేటాయించడం., ఆర్థిక సహాయం అందించడం. కులాల మధ్య ఐక్యత ను పెంపొందేలా ఏక సంఘంగా ఏర్పడాలని సూచనలు సలహాలు ఇవ్వడంతో అనేక బి.సి కులాల ప్రతినిధులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బి.సి కులాల మధ్య ఐక్యమత్యాన్ని పెంపొందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది.తెలంగాణ లో బి.సి కులాల ఆత్మ గౌరవ భవనాలను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

డాక్టర్.ఎస్.విజయ భాస్కర్
తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు
ఆరె కటిక మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అఖిల భారత ఖటిక్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.,తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక సంఘం సలహాదారులు ఏ.కె.సూర్యవంశీ సమాచార్ సంపాదకులు
9290826988.

Get real time updates directly on you device, subscribe now.