*విమల మనోహరి సరస్వతీ*
””””””””””””””””””””””””””””””””””””””””””””””
సర్వ విద్యా బుద్ది సిద్ధికి ఆధారం వాగ్దేవి
కరుణా కటాక్ష కళారస హృదయ దేవి
ఆయుధ రహిత అహింసకు అధినాయిక
వీణాపాణి విమల మనోహరి వరదాయిని
అజ్ఞాన తామసి అంతం చేయు కౌమారి
విజ్ఞాన కాంతి పుంజం వెదజల్లే వాగేశ్వరి
మేధా ధారణ ప్రజ్ఞా ప్రతిభా శక్తుల స్వరూపిణి
బ్రహ్మరూపి భాషాజ్యోతిర్మయి చదువుల వెలది
అపార జ్ఞాన మొసగే విద్యా దానకరీ
భారతీ భగవతీ సామాంపాతు సరస్వతీ
మాఘమాసం వసంత పంచమి శుభదినం
భక్తితో స్తుతించిన దేవెనలిచ్చు శారదా దేవి
జ్ఞాన జ్ఞాపక సకలకళల అధిదేవత శ్రీవాణి
జీవుల నాలుకపై నర్తించే బుద్ది ప్రదాయిని
పలుకులమ్మగా అవతరించిన బ్రహ్మదేవేరి
యుక్తాయుక్త విచక్షణ వివేచన శక్తినిచ్చుతల్లి
అక్షరమాల అభయ ముద్రల పుస్తక ధారిణి
హంసవాహిని ధవళ వస్త్రాలంకరణ తేజస్విని
కవన నైపుణ్య స్ఫూర్తి నిచ్చు మహామాయ
నమ్మిన వారినెపుడు పతనం కానివ్వని బ్రహ్మీ
కాళిదాసుని కలంపాళీ పదును నీవే శివానుజా
శ్వేత పద్మమున ఆసీనురాలైన భువనేశ్వరీ
వాల్మీకీ వేదవ్యాస మహర్షుల వాగ్వైభవం నీవే
పాహిమాం ! రక్షమాం ! దేవీ సత్య స్వరూపిణీ !
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
(సరస్వతీ దేవి జయంతి/వసంత పంచమి శుభాకాంక్షలతో…)
✒️ కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),NVBDCP సబ్ యూనిట్ సికింద్రాబాద్, 8555010108.